Popular Producer-Dil Raju :కాపీ రైట్ కేసులో దిల్ రాజుకు రిలీఫ్

మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ మూవీ కి సంబంధించి

Dil Raju : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజుకు తాత్కాలిక ఉప‌శ‌మ‌నం కలిగింది. ప్రభాస్, కాజల్ అగర్వాల్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కాపీరైట్ కేసును విచారించింది కోర్టు. ఈ సినిమాకు సంబంధించి చాలా కాలంగా కొన‌సాగుతోంది ఈ కేసు.

Dil Raju Copy Right Case Updates

ఇటీవ‌లే త‌న‌పై, ఆఫీసుపై ఐటీ దాడులు చేప‌ట్టింది. ఈ స‌మ‌యంలో త‌ను రిలీజ్ చేసిన రెండు సినిమాల‌లో ఒక‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌గా మెగాస్టార్ త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ తేజ తో తీసిన మూవీ బొక్క బోర్లా ప‌డింది. దీంతో అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సంక్రాంతికి వ‌స్తున్నాం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది ఔరా అనిపించేలా చేసింది. ఒక ర‌కంగా ఈ ఒక్క మూవీతో త‌ను గ‌ట్టెక్కాడు. కాస్తంత ఊపిరి పీల్చుకున్నాడు.

కాగా ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను ప్రధాన పాత్రల్లో దిల్ రాజు(Dil Raju) 2011లో నిర్మించాడు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాను. 2017లో రచయిత్రి ముమ్ముడి శ్యామల దేవి తను రాసిన న‌వ‌ల‌ల నా మ‌న‌సు నిను కోరి నుండి క‌థ‌ను త‌స్క‌రించారంటూ కోర్టుకు ఎక్కింది.

కేసును విచారించిన సిటీ సివిల్ కోర్టు అన్ని ఆధారాల‌ను స‌మీక్షించింది. నిర్మాత‌పై చ‌ర్య తీసుకోవాలంటూ ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాడు. సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ తీర్పు చెప్పింది.

Also Read : శ్రుతీ హాస‌న్ ది ఐ ట్రైల‌ర్ రిలీజ్

Copy Right Actdil rajuPolice CaseUpdatesViral
Comments (0)
Add Comment