Kulasekhar : టాలీవుడ్ ప్రముఖ గీత రచయిత ‘కులశేఖర్’ కన్నుమూత

ఆయన పలు వివాదాలను ఎదుర్కొన్నారు...

Kulasekhar : ప్రముఖ గీత రచయిత కులశేఖర్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం గాంధీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 15, ఆగస్ట్‌ 1971న సింహాచలంలో జన్మించారు. స్కూల్లో ఉన్నప్పుడు పాటలు రాసి బహుమతులు అందుకున్నారు కులశేఖర్‌(Kulasekhar). తర్వాత జర్నలిస్టుగా కెరీర్‌ మొదలుపెట్టారు. సాహిత్యం మీద ఆసక్తి ఉండడంతో సిరివెన్నెల సీతారామశాస్త్రి దగ్గర శిష్యరికం చేస్తూ సినీ గీతాల రచనలో మెళకువలు తెలుసుకున్నారు. తర్వాత తేజ దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన ‘చిత్రం’ సినిమాతో గేయ రచయితగా పరిచయం అయ్యాడు. చిత్రంలో పాటలన్నీ ఆయనే రాశారు. ఆర్‌.పి.పట్నాయక్‌, తేజలతో కలిసి అనేక సినిమాలకు పనిచేశారు. చిత్రం, జయం, రామ్మా! చిలకమ్మా, ఘర్షణ, వసంతం, నువ్వు నేను, ఔనన్నా కాదన్నా, మృగరాజు, సుబ్బు వంటి చిత్రాలకు ఆయన సాహిత్యం అందించి గుర్తింపు తెచ్చుకున్నారు.

Kulasekhar No More..

ఆయన పలు వివాదాలను ఎదుర్కొన్నారు. 2013లో కాకినాడలో బాలాత్రిపుర సుందరి అమ్మవారి శఠగోపాన్ని దొంగిలించినందుకుగాను పోలీసులు ఆయన్ని అరెస్ట్‌ చేశారు. ఆరు నెలలు జైలు శిక్ష విధించారు. ఆ కేసును విచారించిన పోలీసులు మానసిక స్థితి సరిగా లేదని తెలియజేశారు. తర్వాత వైద్యం కోసం రాజమండ్రికి తరలించారు. గీత రచయితగా బిజీగా ఉన్న సమయంలోనే ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా విడుదలకు చాలా ఆలస్యం కావడం వల్ల మానసికంగా కుంగిపోయారని సన్నిహితులు చెబుతుండేవారు. కుటుంబ సభ్యులు ఎవరూ ఆయనను పట్టించుకోరని, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని టాక్‌.

Also Read : Sreetej : పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ కూకట్‌పల్లి పిఎస్ లో యువతి పిర్యాదు

BreakingKulasekharNO MoreUpdatesViral
Comments (0)
Add Comment