అయ్యో త్రిషా ఎందుకు ఇలా..?

థ‌గ్ లైఫ్ లో వేశ్య పాత్ర‌లో న‌టి

మ‌ణిత‌ర్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన క‌మ‌ల్ హాస‌న్, సిలాంబ‌ర‌స‌న్ క‌లిసి న‌టించిన చిత్రం థ‌గ్ లైఫ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది మాత్రం ల‌వ్లీ బ్యూటీ త్రిష కృష్ణ‌న్ గురించి. ఈ చిత్రంలో త‌ను వేశ్య వాటిక‌లో ఉన్న వేశ్య పాత్ర పోషించింది. ఆమెను ఎవ‌రూ ఇలాంటి పాత్ర న‌టిస్తుంద‌ని అనుకోలేదు. జీర్ణించు కోవ‌డం లేదు. త‌ను కేవ‌లం మ‌ణిర‌త్నం కోసం మాత్ర‌మే ఒప్పుకున్నాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

భార‌తీయ సినీ రంగంలో మ‌ణిర‌త్నం అద్భుత‌మైన ద‌ర్శ‌కుడు. త‌ను ఓ డిక్ష‌నరీ లాంటి వ్య‌క్తి. ఏ పాత్ర‌నైనా అద్భుతంగా తెర‌కెక్కించ‌డంలో త‌న‌కు త‌నే సాటి. భార‌తీయ వెండితెర మీద అద్భుతాల‌ను ఆవిష్క‌రించిన ఘ‌న‌త త‌న‌కు ఉంది. త‌ను తీసిన రోజా, నాయ‌కుడు, ఇలా ప్ర‌తి మూవీ ఓ క్లాసిక్. ఇటీవ‌లే త‌ను ఐశ్వ‌ర్య రాయ్ తో తీసిన పొన్నియ‌న్ సెల్వ‌న్ రికార్డు సృష్టించింది.

అయితే క‌మ‌ల్ హాస‌న్ క‌థ రాసిన చిత్రం థ‌గ్ లైఫ్ . మ‌ణిరత్నంతో 38 ఏళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత తీసిన రెండో మూవీ కావ‌డంతో అంచ‌నాలు పెరిగాయి. ఇందుకు త‌గ్గ‌ట్టుగానే సీన్స్ కూడా ఉన్నాయి. క‌మ‌ల్ మూవీ అంటే ముద్దులు, హ‌గ్ లు స‌హ‌జ‌మే. ఆయ‌న ప్ర‌తి మూవీలో ఏదో ఒక కిస్ సీన్ ఉండాల్సిందే. దీనిపై రాద్దాంతం చోటు చేసుకుంది. దీంతో స్వ‌యంగా మ‌ణిర‌త్నం స్పందించాడు. సినిమాలో భాగంగా చూడాలే త‌ప్పా సెక్స్ దృష్టితో చూడొద్ద‌ని కోరాడు. మొత్తంగా త్రిష కృష్ణ‌న్ ఇలాంటి పాత్ర ఒప్పుకోవ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్తం అవుతోంది.

Comments (0)
Add Comment