Trisha Krishnan : లియో స‌క్సెస్ త్రిష‌కు డిమాండ్

ఏకంగా రూ. 10 కోట్ల రెమ్యూన‌రేష‌న్

Trisha Krishnan : ఒక్కోసారి స‌క్సెస్ ఊహించ‌ని రీతిలో వ‌స్తుంది. ఇన్నేళ్లుగా సినీ ఇండ‌స్ట్రీలో ఉన్నా గ్యాప్ త‌ర్వాత త్రిష కృష్ణ‌న్ కు అదృష్టం త‌లుపు త‌ట్టింది. అది దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చారిత్ర‌క నేప‌థ్యంతో తీసిన పొన్నియ‌న్ సెల్వ‌న్ మూవీ రికార్డుల మోత మోగించింది. ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది మెప్పించింది త్రిష‌.

Trisha Krishnan Movies Updates

ఆ త‌ర్వాత లోకేష్ క‌న‌గ‌రాజ్ అనుకోకుండా లియోలో మెయిన్ రోల్ లో న‌టించేందుకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. లోకేష్ కు ఇది రెండో సినిమా త‌ళ‌ప‌తి విజ‌య్ తో. అంత‌కు ముందు మాళ‌విక మోహ‌న్ తో క‌లిసి మాస్ట‌ర్ తీశాడు. అది సూప‌ర్ స‌క్సెస్. త‌న‌కు న‌చ్చితే స‌రి ఎంత రిస్క్ తీసుకునేందుకైనా వెనుకాడ‌డు సూప‌ర్ స్టార్ జోసెఫ్ విజ‌య్.

ఇటు ఇండియాతో పాటు ఓవ‌ర్సీస్ లోనూ దుమ్ము రేపింది లియో. దీంతో త్రిష కృష్ణ‌న్(Trisha Krishnan) కు హెవీ డియోండ్ పెరిగింది. వ‌రుస స‌క్సెస్ ల‌తో దూసుకు పోతున్న త్రిష‌కు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా సినిమాల‌లో నటించేందుకు అవ‌కాశాలు త‌లుపు త‌డుతున్న‌ట్టు స‌మాచారం. అజిత్ తో త‌ను న‌టించ బోయే మూవీకి ఏకంగా రూ. 10 కోట్లు కావాల‌ని కోరిన‌ట్లు ఇండ‌స్ట్రీలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏది ఏమైనా లియో ఇచ్చిన కిక్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది త్రిష కృష్ణ‌న్.

Also Read : Deepika Padukone : ఎక్క‌డి నుంచైనా స్టార్ కావొచ్చు

Comments (0)
Add Comment