Hero Ram Pothineni-Upendra :అంద‌రి వాడు సూర్య కుమార్

రామ్ పోతినేని..బోర్సే మూవీలో

Upendra : యంగ్ హీరో రామ్ పోతినేని, అందాల ముద్దుగుమ్మ భాగ్య‌శ్రీ బోర్సే కీ రోల్స్ పోషిస్తున్న కొత్త మూవీ గురించి అంచ‌నాలు పెరిగాయి. ఈ ఇద్ద‌రూ ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ లో పీక‌ల లోతు ప్రేమ‌లో ప‌డి పోయిన‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. పి. మ‌హేష్ బాబు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రోజుకో అప్ డేట్ ఇస్తూ వ‌స్తున్నాడు. మొత్తంగా రామ్, బోర్సే కాంబినేష‌న్ ఎలా ఉండ బోతోంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

Ram Pothineni-Upendra Movie Updates

ఇవాళ మ‌రో అప్ డేట్ వ‌చ్చింది. సినిమాకు సంబంధించి మే 15న చిత్ర టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనిని నిర్మిస్తోంది మైత్రీ మూవీ మేక‌ర్స్. ఇందులో క‌న్న‌డ సినీ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర(Upendra) కీ రోల్ పోషిస్తుండ‌డం విశేషం. ఆంధ్రా కింగ్ తాలూకా అనే టైటిల్ ను ఖ‌రారు చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ప్ర‌స్తుతం రిలీజ్ చేసిన ఉపేంద్ర‌కు సంబంధించిన పోస్ట‌ర్ కెవ్వు కేక అనిపించేలా ఉంది.

చాన్నాళ్ల త‌ర్వాత ఉపేంద్ర మెయిన్ స్ట్రెయిట్ తెలుగులో వ‌చ్చిన మూవీలో న‌టిస్తుండ‌డం విశేషం. త‌న‌తో పాటు రామ్ పోతినేని పోటీ ప‌డి న‌టిస్తుండ‌డం విశేషం. ఇందులో క‌థ ప‌రంగా ఆంధ్రా కింగ్ అనే బిరుదు ఉంటుంద‌ని, ఆ దిశ‌గానే ద‌ర్శ‌కుడు టైటిల్ ను ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. మొత్తంగా రామ్ పోతినేని , భాగ్య‌శ్రీ బోర్సే తెర పంచుకోవ‌డంపై మ‌రింత ఆస‌క్తిని రేపుతోంది.

Also Read : Single Movie Sensational :సింగిలా మ‌జాకా క‌లెక్ష‌న్స్ ధ‌మాకా

Bhagyashri BorseCinemaRam PothineniUpdatesUpendraViral
Comments (0)
Add Comment