Usthad Bhagat Singh : వారెవ్వా ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ షూటింగ్ బిజీ

Usthad Bhagat Singh : టాలీవుడ్ లో మోస్ట్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు పొందాడు హ‌రీష్ శంక‌ర్. టేకింగ్ , మేకింగ్ లోనే కాదు అద్భుతమైన డైలాగులు రాయ‌డంలో త‌న‌కు త‌నే సాటి. తూటాలు లాంటి మాట‌ల్ని తెర మీద హీరో ద్వారా ప‌లించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. ఆయ‌న ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో తీసిన గ‌బ్బ‌ర్ సింగ్ సెన్సేష‌న్.

Usthad Bhagat Singh Updates

తాజాగా త‌మిళంలో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన మూవీని తెలుగు తెర మీద ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు హ‌రీష్ శంక‌ర్. గుండెల్ని మీటేలా దానికి అద్భుత‌మైన పేరు పెట్టాడు. అదే ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్(Usthad Bhagat Singh). షూటింగ్ కూడా మొద‌లైంది.

మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటేనే అటు రౌడీగా, నాయ‌కుడిగా, పోలీస్ ఆఫీస‌ర్ గా స‌రిగ్గా స‌రిపోతాడు.

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. షూటింగ్ షెడ్యూల్ మొద‌లైంది. ఇందుకు సంబంధించి మైత్రీ మూవీ మేక‌ర్స్ ట్విట్ట‌ర్ వేదిక‌గా అప్ డేట్ పంచుకుంది.

ప‌వ‌ర్ ఫుల్ లుక్స్ తో పోలీస్ ఆఫీస‌ర్ గా న‌డిచి వ‌స్తున్న ఫోటోను షేర్ చేశారు. ఇది మ‌రింత యూత్ ను ఆక‌ట్టుకునేలా ఉంది. ప్ర‌త్యేకించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ కు కిర్రాక్ తెచ్చేలా చేశాడు. మ‌రోసారి హిట్ ఇవ్వ‌డం ప‌క్కా అని తేల్చేశాడు ప‌వ‌ర్ స్టార్.

Also Read : Samantha Vijay Kiss : స‌మంత విజ‌య్ కిస్ మెస్మ‌రైజ్

Comments (0)
Add Comment