Varalaxmi Interesting : త‌నంటే నాకు చ‌చ్చేంత ఇష్టం

న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కామెంట్స్

Varalaxmi : త‌మిళ సినీ రంగానికి చెందిన వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌ను ప్రేమించి ఏరికోరి పెళ్లి చేసుకుంది నికోల‌య్ స‌చ్ దేవ్. త‌న‌తో జీవితం ఆనందంగా సాగుతోంద‌ని పేర్కొంది. తాజాగా త‌న భ‌ర్త వైర‌ల్ గా మారాడు. దీనికి కార‌ణం త‌న‌తో బంధాన్ని పెన వేసుకున్న వ‌ర‌ల‌క్ష్మి(Varalaxmi)నే త‌న ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఆమె ప‌ట్ల త‌న‌కున్న ప్రేమ‌ను ఈ విధంగా వ్య‌క్తం చేశాడు.

Varalaxmi Sharat Kumar Praises Her Husband..

దీంతో తెగ మురిసి పోతోంది ఈ ముద్దుగుమ్మ . పెళ్లి చేసుకోక ముందు జీవితం ఏమిటి అన్న ఆలోచ‌న ఉండేద‌ని, కానీ నికోల‌య్ స‌చ్ దేవ్ త‌న వాకిట్లోకి అడుగు పెట్టాక సీన్ మొత్తం మారి పోయింద‌ని పేర్కొంది న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్.

పెళ్లి కాక ముందు ఒకే పేరు ఉంటుంది. వివాహం అయ్యాక భ‌ర్త పేరును త‌మ ఇంటి పేరుగా మార్చుకోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది భార‌త దేశ వివాహ వ్య‌వ‌స్థ‌లో. కానీ విచిత్రంగా త‌న భార్య పేరునే తన ఇంటి పేరుగా మార్చుకోవ‌డం విశేషం. ఈ సంద‌ర్బంగా సినీ రంగానికి చెందిన న‌టీ న‌టులు, ప్ర‌ముఖులు, ద‌ర్శ‌క నిర్మాత‌లు సైతం వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ భ‌ర్త స‌చ్ దేవ్ ను ప్ర‌త్యేకంగా అభినందిస్తున్నారు.

మ‌హిళ‌ల ప‌ట్ల త‌న‌కున్న గౌర‌వాన్ని త‌న భ‌ర్త ఇలా చాటుకున్నాడంటూ స్ప‌ష్టం చేసింది న‌టి. ప్ర‌స్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Also Read : Pooja Hegde Shocking : ద‌క్షిణాది సినిమాల్లో న‌టించ‌డం క‌ష్టం

CommentsVaralaxmi SarathkumarViral
Comments (0)
Add Comment