Baby John : వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా వస్తున్న ‘బేబీ జాన్’ సినిమా నుంచి కీలక అప్డేట్

వరుణ్‌,కీర్తి సురేష్‌, వామికా గబ్బి నటిస్తున్న ఈ చిత్రంలో లెజెండరీ జాకీ ష్రాఫ్‌ విలన్‌ పాత్రను పోషించారు...

Baby John : వరుణ్‌ ధావన్‌, కీర్తి సురేష్‌ , వామికా గబ్బి కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘బేబీ జాన్‌(Baby John)’ కలీస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ అట్లీ, జియో స్టూడియోస్‌ ఎ ఫర్‌ ఆపిల్‌, సినీ1 స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం టేస్టర్‌ కట్‌ను పేరుతో ఇన్‌స్టా వేదికగా కీర్తి సురేష్‌ టీజర్‌ను విడుదల చేశారు. ‘ఒకవేళ్ల ఇది మొదలైతే రాబోయే భవిష్యత్తు ఊహించుకోండి’ అని వ్యాఖ్యలను రాసుకొచ్చారు. రెండు నిమిషాల టీజర్‌లో చీమల గుంపు ఏనుగును ఎలా ఓడించగలవో ఓ యంగ్‌ గర్ల్‌ చెప్పే మెస్మరైజ్‌ కథనంతో మొదలైంది. ఈ మెటాఫర్‌ వరుణ్‌ క్యారెక్టర్‌ బేబీ జాన్‌ను అద్భుతంగా ప్రజెంట్‌ చేసింది. వరుణ్‌ను ఫెరోషియస్‌ పోలీసుగా, ప్రేమగల తండ్రిగా, యాక్షన్‌ హీరోగా, నైపుణ్యం కలిగిన వంటవాడిగా ఇలా మల్టీషేడ్స్‌లో వరుణ్‌ ధావన్‌ కనిపించారు. బ్రెత్‌ టేకింగ్‌ విజువల్స్‌, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, వరుణ్‌ స్లో-మోషన్‌ స్టంట్స్‌ ప్రేక్షకులను మరింత ఆసక్తిని కలిగించాయి. ఈ టేస్టర్‌ కట్‌ సినిమాపై అంచనాలు పంచుతోంది.

Baby John Movie Updates

వరుణ్‌,కీర్తి సురేష్‌, వామికా గబ్బి నటిస్తున్న ఈ చిత్రంలో లెజెండరీ జాకీ ష్రాఫ్‌ విలన్‌ పాత్రను పోషించారు. ప్రియా అట్లీ, మురాద్‌ ఖేతాని, జ్యోతి దేశ్‌పాండే నిర్మిస్తున్నారు. థమన్‌ మ్యూజిక్‌ స్కోర్‌ మరింత ఉత్కంఠను పెంచుతుంది. డిసెంబర్‌ 25 ఈ చిత్రం విడుదల కానుంది.

Also Read : SDT18 Movie : సాయి ధరమ్ తేజ్, జగపతి బాబు సినిమా నుంచి మరో అప్డేట్

Baby JohnCinemaKeerthy SureshTrendingUpdatesVarun DhawanViral
Comments (0)
Add Comment