Varun Tej : అందాల ముద్దుగుమ్మ, నటి లావణ్య త్రిపాఠికి సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చాడు ప్రముఖ నటుడు వరుణ్ తేజ్. ఈ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు తీపి కబురు చెప్పాడు యాక్టర్. ఇవాళ అధికారికంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అద్భుతమైన ఫోటోను షేర్ చేశాడు. తాను ప్రాణప్రదంగా ప్రేమించిన తన భాగ్యస్వామి లావణ్య త్రిపాఠి గర్భం దాల్చిందంటూ తెలిపాడు. ఈ ప్రపంచంలోకి కొత్తగా మరో ప్రాణి రాబోతోందంటూ తెలిపాడు వరుణ్ తేజ్.
Varun Tej-Lavanya Tripati
తను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. లావణ్య త్రిపాఠి కొన్ని సినిమాలలో నటించింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ తో ప్రేమలో పడింది. ఈ ఇద్దరూ కలిసి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు గ్రాండ్ గా. తమ పేరెంట్స్ గర్వ పడుతున్నారని పేర్కొన్నాడు. ఇదే వార్తను అధికారికంగా ఇన్ స్టా గ్రామ్ లోకి వెళ్లారు. మెగా అభిమానుల నుండి అభినందనలు పెద్ద ఎత్తున వెళ్లువెత్తుతున్నాయి.
జీవితంలో ఇప్పటివరకు అత్యంత అందమైన పాత్ర త్వరలో రాబోతోంది అంటూ వరుణ్ తేజ్ క్యాప్షన్ రాశాడు. వరుణ్ తన చేతులతో లావణ్య, వరుణ్ వేళ్లను బేబీ బూట్లలోకి లాక్ చేసి ఉన్న అందమైన చిత్రాన్ని పంచుకున్నాడు. తను చేసిన కామెంట్స్ తో పాటు ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా నవంబర్ 1, 2023న ఇటలీలోని టస్కానీలో జరిగిన ఒక సన్నిహిత వివాహ వేడుకలో వరుణ్, లావణ్య ఒక్కటయ్యారు.
Also Read : Hero Suhas : మందాడిలో ప్రతి నాయకుడిగా సుహాస్