Dragon Song Sensational :పాట ప‌ర‌వ‌శం హృద‌య స‌మ్మేళ‌నం

డ్రాగ‌న్ వ‌ళితునైయే సాంగ్ సెన్సేష‌న్

Dragon : అశ్వ‌త్ మ‌రిముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన డ్రాగ‌న్(Dragon) చిత్రం క‌లెక్ష‌న్ల సునామి సృష్టిస్తోంది. విడుద‌లైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఇప్ప‌టికే కేవ‌లం 8 రోజుల్లోనే రూ. 60 కోట్ల దాకా వ‌సూలు చేసింది. రాబోయే రోజుల్లో ఇది రూ. 100 కోట్ల క్ల‌బ్ లోకి చేర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ప్రేమ‌, రొమాన్స్, స‌స్పెన్స్, థ్రిల్ల‌ర్ కు తీసిపోని విధంగా క‌థ‌ను తెర‌కెక్కించ‌డంలో త‌న‌కు త‌నే సాటి అని నిరూపించాడు డైరెక్ట‌ర్.

Dragon Movie Song Sensation

డ్రాగ‌న్ సినిమాలో కీల‌క‌మైన పాత్ర‌లు పోషించారు కాయ‌దు లోహ‌ర్, ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ అందించిన మ్యూజిక్, సాంగ్స్ సైతం హృద‌యాల‌ను ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను ఈ చిత్రానికి సంబంధించిన పాట వ‌ళితునైయే ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. దీనిని సిద్ శ్రీ‌రామ్ , సంజ‌న క‌ల్మంజే గుండెల‌ను మీటేలా పాడారు. పాట చిత్రీక‌ర‌ణ హాలీవుడ్ స్థాయిలో ఉంది. అందుకే కుర్ర‌కారు ఎక్కువ‌గా ఈ పాట‌ను వింటున్నారు..చూస్తున్నారు..త‌మ‌ను తాము మైమ‌రిచి పోతున్నారు. అందులో లీన‌మై పాడుకుంటున్నారు.

వెజితునైయే పాట‌ను విఘ్నేష్ శివ‌న్ , కేఓ శేష రాశారు. గిటార్ కేబా జెరెమియా అందిస్తే వ‌యోలిన్ స‌యీ ర‌క్షిత్, మాండోలిన్ విశ్వాస్ హ‌రి, మృదంగం స‌ర్వేష్ కార్తీక్ , డేవిడ్ జోసెఫ్ స‌హ‌కారం అందించారు పాట‌కు. మిలియ‌న్స్ వ్యూస్ తో ప‌రుగులు పెడుతోంది. వీలైతే మీరు కూడా వినండి..చూడండి..ఆస్వాదించండి.

Also Read : Beauty Kayadu Lohar :లోహ‌ర్ టాప్ హీరోయిన్ అవుతుంది

CinemaDragonSensationSongTrendingUpdates
Comments (0)
Add Comment