Victory Venkatesh : ప‌ని చేసుకుంటూ పోతా స‌క్సెస్ ప‌ట్టించుకోను

ఈ విష‌యంలో సూప‌ర్ స్టార్ స‌ల‌హా పాటిస్తున్నా

Venkatesh : టాలీవుడ్ స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేశ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఏ పాత్ర ఇచ్చినా దానిలో ఒదిగి పోయే న‌టుడు ఆయ‌న‌. ఒక ర‌కంగా చెప్పాలంటే త‌ను డైరెక్ట‌ర్స్ హీరో. ఒక్క‌సారి క‌థ నచ్చిందంటే చాలు దాని గురించే ఆలోచిస్తాడు. ఎంత బాగా చేస్తే ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుందోన‌ని ఫోక‌స్ పెడ‌తాడు. ఓ త‌మిళ మీడియా ఛాన‌ల్ తో ఆయ‌న చిట్ చాట్ సంద‌ర్బంగా కీల‌క విష‌యాలు పంచుకున్నారు. గ‌తంలో స‌క్సెస్, ఫెయిల్యూర్ గురించి ఎక్కువ‌గా ఆలోచించే వాడిన‌ని కానీ ఇప్పుడు వాటి గురించి అస్స‌లు ఆలోచించ‌డ‌మే మానేశాన‌ని చెప్పాడు. దీనికంతటికీ ప్ర‌ధాన కార‌ణం త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అని పేర్కొన్నాడు.

Venkatesh Comment

త‌లైవాతో త‌న‌కున్న బంధం గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నాడు. సినిమా స‌క్సెస్ అయితే పొంగి పోవ‌డం, సంబురాలు చేసుకోవ‌డం, ఆడ‌క పోతే నిరాశ‌కు గురి కావ‌డం చేయొద్దు. మ‌న దృష్టి అంతా మ‌నం చేస్తున్న ప‌ని మీదే ఉంచాలి. సినిమాలు చేయ‌డం, దానిలోనే ఆనందం వెతుక్కోవ‌డం చేయాలి. అప్పుడు మన మ‌న‌సు అల‌స‌ట చెంద‌దు. హాయిగా ఉంటుంది. ఇంకొక‌రి గురించి ఆలోచించ‌డం వేస్ట్. జీవితం చాలా స్వ‌ల్పం. దానిని గుర్తించి ముందుకు సాగి పోవ‌డ‌మే మ‌న‌ముందున్నది. ఇది తెలుసుకుని మ‌స‌లుకో గ‌లిగితే లైఫ్ ఇంకా అద్భుతంగా ఉంటుంద‌న్నాడు విక్ట‌రీ వెంక‌టేశ్(Venkatesh).

అందుకే తాను త‌లైవా సూచ‌న‌లు తూచ త‌ప్ప‌కుండా పాటిస్తాన‌ని చెప్పాడు. ఇది చాలా బాగా త‌న‌కు ప‌ని చేసింద‌న్నాడు. ర‌జ‌నీకాంత్ మా నాన్నతో క‌లిసి ప‌ని చేశారు. మా ఫ్యామిలీతో ద‌గ్గ‌రి సంబంధం ఉంద‌న్నాడు. తాను ఇండ‌స్ట్రీకి కొత్త‌గా వ‌చ్చిన‌ప్పుడు త‌ను చెప్పిన మాట‌లే త‌న‌కు ఇప్ప‌టికీ గుర్తు ఉన్నాయ‌ని అన్నాడు. ఇదిలా ఉండ‌గా త‌న‌కు ఈ ఏడాది గొప్ప‌గా ప్రారంభ‌మైంది. ఐశ్వ‌ర్య రాజేష్, మీనాక్షి చౌద‌రితో క‌లిసి న‌టించిన సంక్రాంతికి వ‌స్తున్నాం బిగ్ స‌క్సెస్ అయ్యింది. రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది.

Also Read : Popular Mahatma Jyothirao Phule :జాతికి వెలుగు చూపిన దీప‌దారి పూలే

Commentsvictory venkateshViral
Comments (0)
Add Comment