Victory Venkatesh-Trivikram :త్రివిక్ర‌మ్ తో వెంకీమామ మూవీకి రెడీ

గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన స్టార్ హీరో

Venkatesh : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుడు విక్ట‌రీ వెంకటేశ్. ఇక మాట‌లతో తూటాలు పేల్చే అరుదైన ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. త‌ను మాట‌లతో మంట‌లు పుట్టించ‌గ‌ల‌డు. న‌వ్వులు పూయించ‌గ‌ల‌డు. గుండెల‌ను మీట‌గ‌ల‌డు. ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌గ‌ల‌డు. అంత‌టి శ‌క్తి త‌న‌కు ఉంది. త‌ను సంభాష‌ణ‌లు రాసిన ప్ర‌తి మూవీ బిగ్ హిట్ గా నిలిచింది. ఆ త‌ర్వాత తనే ద‌ర్శ‌కుడిగా మారాడు. టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా నిలిచాడు. త‌ను ప్ర‌స్తుతం విక్ట‌రీ వెంక‌టేశ్ తో సినిమా తీసేందుకు రెడీ అయ్యాడు.

Victory Venkatesh Movie with Trivikram

ఈ మేర‌కు వెంకీమామ‌కు(Venkatesh) క‌థ కూడా చెప్పాడ‌ని, దానికి గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చేశాడ‌ని స‌మాచారం. ఇదిలా ఉండ‌గా ఈఏడాది వెంక‌టేశ్ కు శుభారంభం ఇచ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మినిమం గ్యారెంటీ క‌లిగిన ద‌ర్శ‌కుడిగా పేరు పొందాడు అనిల్ రావిపూడి. త‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వ‌స్తున్నాం. వెంకీమామ‌తో పాటు అందాల భామ‌లు ఐశ్వ‌ర్య రాజేశ్, మీనాక్షి చౌద‌రి క‌లిసి న‌టించారు. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

ఏకంగా ఈ మూవీ అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఆ త‌ర్వాత ఎవ‌రితో వెంక‌టేష్ మూవీ తీస్తార‌నే దానిపై కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు తెర దించాడు. త్రివిక్ర‌మ్ తో ఓకే చెప్పాడ‌ని, త్వ‌ర‌లోనే సెట్స్ లోకి వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. మొత్తంగా మాట‌ల‌తో మ‌రోసారి క‌వ్వించేందుకు ఇద్ద‌రూ రెడీ అయ్యార‌న్న‌మాట‌.

Also Read : Hero Vishal Health :హీరో విశాల్ కు అస్వ‌స్థ‌త

CinemaTrendingTrivikram SrinivasUpdatesvictory venkatesh
Comments (0)
Add Comment