Chary 111 : వెన్నెల కిషోర్ కీ రోల్ పోషించిన చిత్రం చారీ 111. విచిత్రం ఏమిటంటే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన మేర ఆడలేదు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు ఈ మూవీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది వరల్డ్ వైడ్ గా . అమెజాన్ ప్రైమ్ లో హల్ చల్ చేస్తోంది. తెలుగులో పూర్తిగా యాక్షన్ కామెడీగా తీర్చి దిద్దాడు దర్శకుడు. ప్రస్తుతం విదేశాలలో కొత్త ఊపు కొనసాగిస్తోంది. దీంతో మూవీ మేకర్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
Chary 111 Movie Sensational
యునైటెడ్ కింగ్ డమ్ లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ లో ఉండడం విశేషం. థియేటర్ల వద్దకు వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. అంతర్జాతీయ డిజిటెల్ మార్కెట్ లోకి అడుగు పెట్టే ప్రాంతీయ భారతీయ సినింమాకు మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పక తప్పదు. ఆదితి సోనీ నిర్మించిన చారీ 111(Chary 111) తొలుత మార్చి 1న గత ఏడాదిలో రిలీజ్ అయ్యింది.
యాక్షన్, కామెడీ, థ్రిల్లర్ అంశాలను మిళితం చేస్తూ తెరకెక్కించాడు దర్శకుడు. ఈ చిత్రం ఒక గందరగోళ రహస్య ఏజెంట్ చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఈ సందర్బంగా దర్శకడుఉ టీజీ కీర్తి కుమార్ స్పందించారు. ప్రపంచ వేదికలపై చారి 111కి ఆదరణ లభించడం ఆనందంగా ఉందన్నారు. దీన్ని బట్టి చూస్తే కథ బాగుంటే ఎక్కడైనా సినిమాలను ఆదరిస్తారన్న నమ్మకం తమ సినిమాతో రుజువైందన్నారు. యుకె వేదికగా తెలుగు మూవీని ఇంతలా ఆదరిస్తారని తాము అనుకోలేదన్నారు.
Also Read : Ajaz Khan Sensational :హౌస్ అరెస్ట్ నుండి అజాజ్ ఖాన్ తొలగింపు