Popular Actor Manoj Kumar :న‌టుడు మ‌నోజ్ కుమార్ క‌న్నుమూత

బాలీవుడ్ లో అలుముకున్న విషాదం

Manoj Kumar : బాలీవుడ్ లో విషాదం అలుముకుంది. ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు మ‌నోజ్ కుమార్ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 87 ఏళ్లు. గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయి అంబానీ ఆస్ప‌త్రిలో చేరారు. శుక్ర‌వారం 3.30 గంట‌ల‌కు మృతి చెందారు. ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల‌లో న‌టించారు. పురబ్ ఔర్ పశ్చిమ్, క్రాంతి వంటి దేశభక్తి చిత్రాలలో తన పాత్రలకు పేరు పొందాడు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతాపం తెలిపారు.

Actor Manoj Kumar No More

బాలీవుడ్ కు చెందిన న‌టీ న‌టులు ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరారు. హిందీ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో జ‌నాద‌ర‌ణ పొందారు మ‌నోజ్ కుమార్(Manoj Kumar). ఆయ‌న భార‌తీయ సినిమాకు ఓ ఐకాన్ గా నిలిచారు. ముఖ్యంగా దేశ‌భ‌క్తి సినిమాల‌కు పేరొందారు. జాతీయ‌త‌ను పెంపొందించేలా, భార‌తీయ‌త‌ను ఉట్టి ప‌డేలా త‌ను చేసిన ప్ర‌య‌త్నం ఎల్ల‌కాలం నిలిచి పోతుంద‌ని పేర్కొన్నారు ప్ర‌ధాన‌మంత్రి.

ఇదిలా ఉండ‌గా మ‌నోజ్ కుమార్ 1937లో అబోటాబాద్ అనే చిన్న ఊరులో పుట్టాడు. 1975లో ఫ్యాష‌న్ చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెట్టారు. సాయిదా ఖాన్ తో కలిసి న‌టించిన గుడియా సినిమా త‌న‌కు బ్రేక్ ఇచ్చేలా చేసింది. 1965లో వ‌చ్చిన గుమ్నామ్ బిగ్ స‌క్సెస్ సాధించింది. ఏకంగా రూ. 2.6 కోట్లు వ‌సూలు చేసింది. ష‌హీద్ మూవీలో న‌టించాడు. ఇది ష‌హీద్ భ‌గ‌త్ సింగ్ జీవితం ఆధారంగా తీసింది. ఉప‌కార్ , పుర‌బ్ ఔర్ ప‌చ్చిమ్ , క్రాంతి వంటి దేశ భ‌క్తి చిత్రాల‌లో పేరొచ్చింది. దీంతో ఆయ‌న‌కు భ‌ర‌త్ కుమార్ అనే మారు పేరు కూడా వ‌చ్చింది.

Also Read : Coolie OTT- Blockbuster Price :రికార్డ్ ధ‌ర‌కు త‌లైవా కూలీ ఓటీటీ రైట్స్

ActorBollywoodShockingUpdatesViral
Comments (0)
Add Comment