Vetrimaaran : వెట్రిమారన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను తీసింది కొన్ని చిత్రాలే కానీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సామాజిక కోణంలో ఆలోచింప చేసేలా మూవీస్ తీయడం తన ప్రత్యేకత. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు వెట్రిమారన్(Vetrimaaran) అంటే వల్లమాలిన అభిమానం. ఎందుకంటే తను అందరి లాంటి దర్శకుడు కాదు. కథ, కథనం, చిత్రీకరణ ప్రత్యేకంగా ఉంటుంది. అది ఆలోచింప చేసేలా చేస్తుంది. అంతకు మించి మనసులను వెంటాడుతుంది. పూర్తిగా కమర్షియల్ గా కాక పోయినా తను తీసే మూవీస్ మాత్రం వెరీ వెరీ స్పెషల్.
Ram Charan Praises Vetrimaaran Story
ఎన్టీఆర్ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కొరటాల శివ దేవర -2 సీక్వెల్ లో నటించనున్నాడు. ఇదే సమయంలో మంచి కథలను కూడా వింటున్నట్టు టాక్. స్టార్ హీరోలైనా కథలు వినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కథలో దమ్ముంటే వాటికి ప్రయారిటీ ఇస్తున్నారు. అవతల ఎంతటి పెద్ద దర్శకుడైనా సరే ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం జక్కన్న మూవీతో బిజీగా ఉండగా గ్లోబర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) బుచ్చిబాబు సన తీస్తున్న పెద్దిలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ కు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది.
ఇదిలా ఉండగా ఇటు టాలీవుడ్ లో అటు కోలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే రామ్ చరణ్ స్వయంగా వెట్రీ మారన్ చెప్పిన కథ విన్నాడని, చాలా నచ్చిందని టాక్. ఏది ఏమైనా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం తనది. ఇక జూనియర్ ఎన్టీఆర్, చెర్రీ కలిసి ఆర్ఆర్ఆర్ లో నటించారు. ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ ఇద్దరికీ ఇష్టమైన దర్శకుడు వెట్రీ మారన్ కావడం విశేషం. అయినా తమిళ దర్శకుడు మాత్రం ఎక్కడా దీని గురించి చెప్పక పోవడం విశేషం.
Also Read : Renu Desai Shocking :ఛాన్స్ లు వచ్చినా పిల్లల కోసం వదులుకున్నా