Harish Shankar- Victory Venkatesh :హ‌రీశ్ శంక‌ర్ కు వెంకీ మామ ఓకే చెప్పాడా..? 

టాలీవుడ్ లో జోరందుకున్న ప్ర‌చారం 

Harish Shankar : టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ క‌లిగిన న‌టుడు విక్ట‌రీ వెంక‌టేశ్. త‌న జాన‌ర్ వేరే. పూర్తిగా కామెడీ, ఎంట‌ర్ టైన‌ర్ కే ప్ర‌యారిటీ ఇస్తూ వ‌స్తున్నాడు. ఓ వైపు కుర్ర హీరోలు నానా తంటాలు ప‌డుతుంటే త‌ను మాత్రం ఎంచక్కా ఫ్యామిలీని ల‌క్ష్యంగా చేసుకుని క‌థ‌ల‌ను ఎంచుకుంటున్నాడు. పూర్తిగా ఇంటిల్లిపాదిని న‌వ్వించేలా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. అంతే కాదు ఓ వైపు మూవీస్ ఇంకో వైపు వెబ్ సీరీస్ లో బిజీగా మారి పోయాడు. ఇక ఏమాత్రం వీలు చిక్కినా క్రికెట్ మ్యాచ్ ల‌ను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతే కాదు త‌ను ఎవ‌రి గురించి ప‌ట్టించుకోడు. వీలు కుదిరితే పుస్త‌కాలు చ‌దువుతాడు లేదంటే ధ్యానంలో మునిగి పోతాడు.

Harish Shankar – Victory Venkatesh Movie Updates

తాజాగా ఓ వార్త గుప్పుమంటోంది టాలీవుడ్ లో. చాలా మంది ద‌ర్శ‌కులు చెప్పిన క‌థ‌లు విన్నాడ‌ని, చివ‌ర‌కు డైన‌మిక్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్(Harish Shankar) చెప్పిన స్టోరీకి ఓకే కూడా చెప్పాడ‌ని వినికిడి. ఇటీవ‌లే త‌ను మాస్ మ‌హ‌రాజా, భాగ్య‌శ్రీ భోర్సేతో క‌లిసి మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ తీశాడు. ఇది మ్యూజిక‌ల్ గా హిట్ అయినా ఎందుక‌నో సినిమా ఆడ‌లేదు. అయినా త‌ను ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు హ‌రీశ్ శంక‌ర్. ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలో ముందుకు సాగుతున్నాడు. ఇక విక్ట‌రీ వెంక‌టేశ్(Victory Venkatesh) పూర్తిగా కామెడీ , స‌స్పెన్స్ ఉండే వాటికే త‌ను మొగ్గు చూపుతున్నాడు. ఇక సినీ ఇండ‌స్ట్రీలో మినిమం గ్యారెంటీ క‌లిగిన ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన అనిల్ రావిపూడితో వ‌రుస‌గా మూవీస్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఈ ఏడాది శుభారంభం ల‌భించింది విక్ట‌రీ వెంక‌టేశ్ కు. నిర్మాత దిల్ రాజు నిర్మాణ సార‌థ్యంలో సంక్రాంతి పండ‌గ సంద‌ర్బంగా సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రం రిలీజ్ అయ్యింది. ఏకంగా రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. ఇందులో వెంకీతో పాటు ఐశ్వ‌ర్య రాజేశ్, మీనాక్షి చౌద‌రి, బుల్లి రాజు పాత్ర‌లో రేవంత్ న‌టించారు. అంతే కాదు మామ పాత్ర‌లో ఇర‌గ‌దీశాడు ముర‌ళీధ‌ర్ గౌడ్. హీరోను అద్భుతంగా తెర‌కెక్కించ‌డంలో త‌న‌కు త‌నే సాటి హ‌రీశ్ శంక‌ర్. వెంకీతో తీయ‌బోయే మూవీ పై ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : Hero Pawan Kalyan Movie :ఫైన‌ల్ షెడ్యూల్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ బిజీ

CinemaHarish SankarUpdatesvictory venkateshViral
Comments (0)
Add Comment