Victory Venkatesh – SV Collections : న‌వ్వుల న‌జ‌రానా వ‌సూళ్ల ఖ‌జానా

కాసులు కురిపిస్తున్న సంక్రాంతికి వ‌స్తున్నాం

Victory Venkatesh : కంటెంట్ బ‌లంగా ఉంటే క‌టౌట్ తో ఏం ప‌ని. అందుకే దానినే న‌మ్ముకున్న ద‌ర్శ‌కులలో అనిల్ రావిపూడి ఒక‌డు. త‌ను మినిమం గ్యారెంటీ ఉన్న డైరెక్ట‌ర్ గా పేరు పొందాడు. ఫ‌క్తు కామెడీని పండించ‌డంలో త‌న‌కు త‌నే సాటి. ఆనాటి జంధ్యాల‌, ఈవీవీ స‌త్య నారాయ‌ణ‌ల వార‌స‌త్వాన్ని మ‌నోడు కొన‌సాగిస్తూ వ‌స్తున్నాడు. త‌ను ఒక‌టి రెండు సీరియ‌స్ సినిమాలు తీశాడు. కానీ రూటు మార్చాడు. కేవ‌లం వినోదం పండించేందుకే ప్ర‌యారిటీ ఇస్తూ వ‌చ్చాడు.

Victory Venkatesh Sankranthiki Vasthunnam Collections

త‌న‌కు నిర్మాత దిల్ రాజు తో, విక్ట‌రీ వెంక‌టేశ్(Victory Venkatesh) తో వ‌ర్క‌వుట్ కావ‌డంతో మ‌రోసారి హ్యాట్రిక్ హిట్ కొట్టాడు సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీతో. గ‌తంలో ఎఫ్2, ఎఫ్‌3 మూవీస్ బిగ్ స‌క్సెస్ అయ్యాయి. తాజాగా విడుద‌లైన వెంకీ మామ మూవీ సూప‌ర్ డూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కాసుల వ‌ర్షం కురిపిస్తోంది.

మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేష్ , వెంక‌టేశ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీ ఇంటిల్లిపాదిని అల‌రిస్తోంది. న‌వ్వుల‌ను పూయిస్తోంది. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే కేవ‌లం మూడు రోజుల్లోనే సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవ‌డం విశేషం. ఇదే విష‌యాన్ని మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. రాబోయే రోజుల్లో మ‌రెన్ని కాసులు కురిపిస్తుందో వేచి చూడాలి.

Also Read : Legendary Actor Brahmanandam : బ్ర‌హ్మానందం సినీ వేదాంతం

CollectionsSankranthiki VasthunnamTrendingUpdatesvictory venkatesh
Comments (0)
Add Comment