Victory Venkatesh Movie : సంక్రాంతికి వ‌స్తున్నాం అంత‌టా బ్ర‌హ్మ‌ర‌థం

శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్న టీం

Victory Venkatesh : మినిమం గ్యారెంటీ క‌లిగిన ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ దుమ్మ రేపుతోంది. కేవ‌లం విడుద‌లైన రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. సినీ వ‌ర్గాల‌ను విస్మయం చెందేలా చేసింది.

Victory Venkatesh Sankranthiki Vasthunnam Movie..

కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. పూర్తిగా వినోద భ‌రితంగా ఉండేలా తెరకెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు. దీంతో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు సినిమాకు సంబంధించి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చాలా కాలం త‌ర్వాత మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌మ‌ణ గోగుల ఇందులో సాంగ్ పాడారు. ఇది కూడా సినిమాకు బిగ్ అస్సెట్ అయ్యింది. ఇక క‌థ‌, స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ అంతా అనిల్ రావిపూడిదే.

ఇక సినిమా విష‌యానికి వ‌స్తే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. విక్ట‌రీ వెంక‌టేశ్, ఐశ్వ‌ర్య రాజేశ్, మీనాక్షి చౌద‌రి. ప్ర‌ధానంగా బుల్లి రాజు పాత్ర‌లో చిన్నోడు చేసిన హంగామా సినిమాకు హైలెట్ గా నిలిచింది. మొత్తంగా రూ. 150 కోట్ల‌కు సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రం వ‌సూళ్లు రాబ‌ట్టింద‌ని ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా.

Also Read : Hot Beauty – Taapsee : గాంధారి షూటింగ్ లో తాప్సీ ప‌న్ను బిజీ

CinemaSankranthiki VasthunnamTrendingUpdatesvictory venkatesh
Comments (0)
Add Comment