Vidya Balan: అన్ లక్కీ ట్యాగ్‌ వల్ల 12 సినిమాలు చేజారిపోయాయి – విద్యాబాలన్

అన్ లక్కీ ట్యాగ్‌ వల్ల 12 సినిమాలు చేజారిపోయాయి - విద్యాబాలన్

Vidya Balan: కహానీ, డర్టీ పిక్చర్, హమారీ అదూరీ కహానీ సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ విజయాలను అందుకున్న బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్. పెళ్లి తరువాత చేసిన సినిమాలు ఘన విజయం కావడంతోపాటు వరుస ఆఫర్లు అందుకుంటున్న విద్యా బాలన్(Vidya Balan)… ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కెరీర్‌ ఆరంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై మాట్లాడారు. తొలినాళ్లలోనే స్టార్‌ హీరో చిత్రాల్లో నటించే అవకాశం వచ్చిందని… అనుకోని కారణాలతో ఆయా చిత్రాలు కార్యరూపం దాల్చలేదని వాపోయారు. ముఖ్యంగా మలయాళం స్టార్ హీరో మోహన్‌ లాల్‌ తో చేయాల్సిన సినిమా అర్ధాంతరంగా ఆగిపోవడంతో 12 సినిమాలు చేజారిపోయాయని చెప్పారు.

Vidya Balan Comment

‘‘కెరీర్‌ ఆరంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. చాలా మంది నిర్మాతలు సినిమాల్లో అవకాశాలు ఇచ్చినట్టే ఇచ్చి… ఏదో ఒక కారణం చెప్పి చివరకు నన్ను తొలగించేవారు. దాదాపు మూడేళ్లు ఈ పరిస్థితి కొనసాగింది. అవకాశం చేజారిన ప్రతిసారీ నా హృదయం ముక్కలయ్యేది. ఏడ్చుకుంటూ నిద్రలేని రాత్రులు గడిపా. మోహన్‌ లాల్‌ తో చేయాల్సిన సినిమా ఆగిపోయిన సమయంలోనే… నేను నటించాల్సిన మరో మలయాళ మూవీ కూడా నిలిచిపోయింది. దీనితో నాపై అన్‌ లక్కీ ట్యాగ్‌ వేశారు. అది నన్ను మరింత కుంగదీసింది. ఆ కారణంతో దాదాపు డజను సినిమాలు కోల్పోయా. పలువురు నిర్మాతలు తమ చిత్రాల్లో నన్ను రీప్లేస్‌ చేసి.. వేరొకరికి అవకాశం ఇచ్చారు’’

అలాగే తనపై ఒక నిర్మాత చేసిన వ్యాఖ్యలు ఎప్పటికీ మర్చిపోనని తెలిపారు. ‘‘నేనొక తమిళ చిత్రంలో నటించా. షూట్‌ సమయంలో నిర్మాతను కలుద్దామని ఎన్నోసార్లు ప్రయత్నించినా ఆయన ఆసక్తి చూపించలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ సినిమా నుంచి నన్ను తొలగించినట్లు వార్తలు వచ్చాయి. నా జాతకం తన వద్ద ఉందని, నేనొక దురదృష్టవంతురాలినని అందుకే ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తున్నానని ఆయన మీడియాతో చెప్పారు. ఇదే విషయంపై నా తల్లిదండ్రులు ఆయన్ని కలవగా.. ‘తను హీరోయిన్‌ లా అయినా కనిపిస్తుందా ?’ అని చులకనగా మాట్లాడారు’’ అని విద్యాబాలన్‌ తెలిపారు.

Also Read : Salman Khan: సల్మాన్ ఇంటి ముందు కాల్పులు ! జరిపింది మేమే అంటున్న బిష్ణోయ్ గ్యాంగ్ !

MohanlalVidya Balan
Comments (0)
Add Comment