Vijay Antony: త్వరలో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తానంటోన్న విజయ్ ఆంటోని !

త్వరలో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తానంటోన్న విజయ్ ఆంటోని !

Vijay Antony: తమిళంలో సంగీత దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించి కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగారు విజయ్‌ ఆంటోని. బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపుతోపాటు మార్కెట్‌ కూడా పెంచుకున్నారు. ప్రస్తుతం ‘తుఫాన్‌’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్థమయ్యారు విజయ్ ఆంటోని(Vijay Antony). ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎదురైన ప్రశ్నపై ఆశక్తికరమైన సమాధానాలు ఇచ్చారు.

Vijay Antony Comment

‘సినిమా వాళ్లపై ఎక్కువగా రూమర్స్‌ వస్తుంటాయి. వాటిని మీరెలా స్వీకరిస్త్తారు?’ అని యాంకర్‌ అడగ్గా.. ‘‘వాటిని నేను పట్టించుకోను. విని వదిలేస్తా’’ అని విజయ్‌ ఆంటోని అన్నారు. తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు అని అడగగా ‘‘నేరుగా తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నా.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఏ ప్రాజెక్టు ఖరారు కాలేదు’’ అని తెలిపారు. అతి త్వరలోనే డైరెక్ట్ తెలుగు ప్రాజెక్టు చేస్తానని అన్నారు.

కమర్షియల్‌ హంగులతో దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. సత్యరాజ్‌, శరత్‌కుమార్‌, మేఘా ఆకాశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళ్‌తోపాటు తెలుగులోనూ ఈ సినిమాని ఈ నెల 2న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. తాజాగా తెలుగు వెర్షన్‌ను పోస్ట్‌పోన్‌ చేసినట్టు సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 9న విడుదల చేయనున్నారు.

Also Read : Taapsee Pannu: ఒలింపిక్స్‌ గ్యాలరీలో తాప్సీ, కోర్టులో మాథియాస్ సందడి !

ToofanVijay Antony
Comments (0)
Add Comment