Hero Vijay Antony-Margaan :జూన్ 27న ఆంటోనీ మార్గన్ రిలీజ్

ప్ర‌క‌టించిన మూవీ మేక‌ర్స్

Margaan : బిక్ష‌గాడు మూవీతో దేశ వ్యాప్తంగా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన హీరో విజ‌య్ ఆంటోనీ కీల‌క పాత్ర పోషిస్తున్న చిత్రం మార్గాన్. దీనిని మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు తీపికబురు చెప్పారు. జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని ప్ర‌క‌టించారు.

Vijay Antony-Margaan Movie Updates

తాజాగా కొత్త ప్రాజెక్టు మార్గ‌న్(Margaan) తో ముందుకు వ‌స్తున్నాడు. మీరా విజ‌య్ ఆంటోనీ స‌మ‌ర్పిస్తోంది. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ ప‌తాకం పై నిర్మించారు. ప్రముఖ ఎడిటర్ లియో జాన్ పాల్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు ఈసినిమా ద్వారా. ఇదర్కుతానే ఆసైపట్టై బాలకుమార, సూదు కవ్వం వంటి చిత్రాలలో అవార్డు గెలుచుకున్న లియో ఇప్పుడు డిటెక్టివ్ ఫిక్షన్ ప్రపంచంలోకి లోతుగా వెళ్ళే ఈ ఉత్కంఠ భరితమైన కథతో దర్శకుడిగా పగ్గాలు చేపట్టాడు.

ఇదిలా ఉండ‌గా విడుదల తేదీని ఖరారు చేయడంతో మార్గ‌న్ నిర్మాతలు ప్రచార కార్యక్రమాలను మరింత పెంచనున్నారు. ఇందులో విచిత్రం ఏమిటంటే విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ భయంకరమైన విలన్ పాత్రలో తొలిసారిగా నటిస్తున్నారు. సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడ, వినోద్ సాగర్, దీప్శిఖ, కలక్క పోవధు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ ఇత‌ర పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాకు విజ‌య్ ఆంటోనీ తొలిసారిగా మ్యూజిక్ అందిస్తుండ‌డం విశేషం.

Also Read : Ajit Agarkar Shocking :ఆల్ రౌండ‌ర్ పైనే అగార్క‌ర్ ఫోక‌స్

CinemaMarganUpdatesVijay AntonyViral
Comments (0)
Add Comment