Vijay Antony Daughter : విజ‌య్ ఆంటోనీ కూతురు సూసైడ్

కోలీవుడ్ లో నెల‌కొన్న విషాదం

త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో విషాదం అలుముకుంది. ప్ర‌ముఖ న‌టుడు బిచ్చ‌గాడు సినిమా న‌టుడు విజ‌య్ ఆంటోనీ కూతురు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. తీవ్ర‌మైన ఒత్తిడి నెల‌కొన‌డం వ‌ల్ల‌నే ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన‌ట్లు స‌మాచారం. దీనిపై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

విజ‌య్ ఆంటోనీ కూతురు సూసైడ్ కు పాల్ప‌డింద‌న్న విష‌యం తెలుసుకున్న వెంట‌నే సినీ ప్ర‌ముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. విజ‌య్ కుటుంబీకులు క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇటీవ‌ల ఆత్మ‌హ‌త్య‌ల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.

క‌రోనా కంటే ముందు త‌ర్వాత కూడా ఇది జ‌రుగుతూనే వ‌స్తోంది. ప్ర‌ముఖ న‌టీన‌టులు కాలం చేశారు. మ‌రికొంద‌రు తీవ్ర ఇబ్బందుల‌కు లోన‌య్యారు. ఇక విజ‌య్ ఆంటోనీ విష‌యానికి వ‌స్తే ఆయ‌న న‌టించిన బిచ్చ‌గాడు బ్లాక్ బిస్ట‌ర్ గా నిలిచింది.

ఈ ఒక్క సినిమాతో స్టార్ డ‌మ్ సంపాదించుకున్నాడు విజ‌య్ ఆంటోనీ. దేశ వ్యాప్తంగా అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.

Comments (0)
Add Comment