Vijay Devarakonda : వినాయ‌క వేడుక‌ల్లో తార‌ల సంద‌డి

స‌క్సెస్ రావాల‌ని మొక్కుకున్నా

వినాయ‌క చ‌వితి సంద‌ర్బంగా తార‌లు సంద‌డి చేస్తున్నారు. విఘ్నాలు తొల‌గించాల‌ని, త‌మ కెరీర్ బాగుండాల‌ని గ‌ణ‌ప‌తి దేవుడిని వేడుకున్నారు. మ‌రికొంద‌రు ఘ‌నంగా పూజ‌లు చేశారు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్ రంగాల‌కు చెందిన న‌టీ న‌టులు, సాంకేతిక నిపుణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తాజాగా రౌడీగా పేరు పొందిన యంగ్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ఫ్యామిలీతో క‌లిసి వినాయ‌క పూజ‌ల్లో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫోటోలు షేర్ చేశాడు. త‌న పేరెంట్స్ కూడా ఇందులో ఉండ‌డం విశేషం. విజ‌య్ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌, పేరెంట్స్ గోవ‌ర్ద‌న్ రావు, మాధ‌వి దేవ‌ర‌కొండ‌తో క‌లిసి పాల్గొన్నారు. త‌మ ఆనందాన్ని పంచుకున్నారు.

ప్ర‌తి ఒక్క‌రూ సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని కోరాడు న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. మ‌రో వైపు మెగాస్టార్ ఫ్యామిలీ సైతం వినాయ‌క వేడుక‌ల్లో పాల్గొన్నారు. రామ్ చ‌ర‌ణ్ , ఉపాస‌న కొణిదెల తో క్లారా కూడా ఉన్నారు. బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా పండుగ చేసుకున్నారు.

విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ‌, మ‌నీష్ మ‌ల్హోత్రా, మ‌లైకా అరోరా, కియారా అద్వానీ, జాన్వీ , ఖుషీ క‌పూర్ , సారా అలీ ఖాన్ , క‌ర‌ణ్ జోహార్, అన‌న్య పాండే , షాన‌యా క‌పూర్ కూడా వినాయ‌క వేడుక‌ల్లో హాజ‌ర‌య్యారు.

Comments (0)
Add Comment