Hero Vijay-Kingdom :మే 30న రానున్న రౌడీ కింగ్‌డమ్‌

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మూవీ మేక‌ర్స్

Kingdom : టాలీవుడ్ లో రౌడీ స్టార్ గా పేరొందిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. త‌ను న‌టిస్తున్న చిత్రం కింగ్ డ‌మ్(Kingdom). దీనిని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య నిర్మిస్తున్నారు. గౌత‌మ్ తిన్న‌సూరి చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్స్, టీజ‌ర్ అంచ‌నాల‌కు మించి ఆద‌ర‌ణ పొందాయి. ప్ర‌త్యేకించి శ్రీ‌లంక ప‌రిస‌ర ప్రాంతాల‌లో చిత్రీక‌రించిన స‌న్నివేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయ‌ని సినీ వ‌ర్గాల భోగ‌ట్టా.

Vijay Deverakonda – Kingdom Movie Updates

దేవ‌ర‌కొండ(Vijay Deverakonda) నుంచి వ‌చ్చే చిత్రం కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. సినిమా విడుద‌ల‌కు సంబంధించి ఉత్కంఠ‌కు తెర దించారు నిర్మాత నాగ‌వంశీ. మే 30వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా కింగ్ డ‌మ్ ను విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనిని పాన్ ఇండియాగా తెర‌కెక్కించారు. గ‌తంలో త‌ను న‌టించిన లైగ‌ర్ బెడిసి కొట్టింది. బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఆ త‌ర్వాత ఖుషీ వ‌చ్చింది. అది కూడా ఆశించిన మేర ఆడ‌లేదు. చాలా గ్యాప్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ నుంచి వ‌స్తున్న మూవీ కింగ్ డ‌మ్.

త‌న‌లోని న‌టుడిని భిన్నంగా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు గౌతం తిన్న‌సూరి. దీనికి జూనియ‌ర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డం విశేషం. దీంతో మూవీపై బ‌జ్ మ‌రింత పెరిగింది. కింగ్ డ‌మ్ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్న‌ట్టు తెలిపారు నిర్మాత‌. ఇక బాలీవుడ్ బ్యూటీ భాగ్య‌శ్రీ భోర్సే ఇందులో కీ రోల్ పోషిస్తుండ‌గా రాక్ స్టార్ అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తుండ‌డం విశేషం.

Also Read : Hero Ram Charan-Vetrimaaran :వెట్రీ మార‌న్ క‌థ‌కు గ్లోబ‌ల్ స్టార్ ఫిదా

CinemaKingdomTrendingUpdatesVijay Deverakonda
Comments (0)
Add Comment