Hero Vijay-Anirudh : అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ మ్యాజిక్ చేసింది

ప్ర‌శంస‌లు కురిపించిన విజ‌య్ దేవ‌ర‌కొండ

Vijay : టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను న‌టిస్తున్న చిత్రం గౌత‌మ్ తిన్న‌సూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న కింగ్ డ‌మ్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావ‌చ్చింది. ఇదే మూవీకి సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చేసింది. తొలి సాంగ్ హృద‌యం లోప‌లా ను రిలీజ్ చేశారు. దీనికి స్వ‌రాలు కూర్చారు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద‌ర్. ఈ సంద‌ర్బంగా విడుద‌లైన కొద్ది సేప‌టికే ఏకంగా ల‌క్ష‌ల కొద్ది వ్యూస్ వ‌స్తున్నాయి.

Vijay Deverakonda Appreciates

ఇది ఇంట‌ర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇందులో కీ రోల్ పోషిస్తోంది ముంబై ముద్దుగుమ్మ భాగ్య‌శ్రీ బోర్సీ. రౌడీతో పాటు బోర్సే పై తీసిన చిత్రీక‌ర‌ణ అద్బుతంగా ఉంద‌న్న టాక్ వ‌చ్చింది.ఈ సంద‌ర్బంగా చిట్ చాట్ చేశాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌(Vijay Deverakonda). తాము న‌టించిన పాట‌ను ఆద‌రిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు తాను స‌ర్వ‌దా రుణ‌ప‌డి ఉంటాన‌ని స్ప‌ష్టం చేశాడు. అనిరుధ్ ర‌విచంద‌ర్ కు తాను బిగ్ ఫ్యాన్ అని చెప్పాడు. త‌ను త‌న సినిమాకు సంబంధించి ఇంత గొప్ప‌గా సంగీతం అందించ‌డం త‌న‌ను మ‌రింత ఆనందం పొందేలా చేసింద‌న్నాడు.

చిత్రీక‌రించిన ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌సూరికి, కెమెరామెన్ల‌కు, సినిమాటోగ్ర‌ఫ‌ర్ల‌కు, కొరియోగ్ర‌ఫీకి చాలా థ్యాంక్స్ అన్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. తాను చిన్న‌ప్ప‌టి నుంచి అనిరుధ్ సంగీతాన్ని వింటూ వ‌చ్చాన‌ని అన్నాడు. 10 సంవ‌త్స‌రాల త‌ర్వాత నా 13వ చిత్రం 28 రోజుల్లో విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది. ఈ మూవీ , పాట గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు. హృద‌యం లోపాల ఫ‌స్ట్ సింగిల్ స‌క్సెస్ అయ్యింది. పాట‌ను కూడా అద్భుతంగా ఆద‌రిస్తున్నందుకు హ్యాపీగా ఉంద‌న్నారు.

Also Read : Hero Vijay Deverakonda :దేవ‌రకొండ‌..బోర్సే కింగ్ డ‌మ్ ఫ‌స్ట్ సాంగ్ కేక‌

Anirudh RavichanderCinemaCommentsKingdomTrendingVijay Deverakonda
Comments (0)
Add Comment