Hero Vijay Deverakonda :దేవ‌రకొండ‌..బోర్సే కింగ్ డ‌మ్ ఫ‌స్ట్ సాంగ్ కేక‌

హృద‌యం లోప‌లా గుండెలు గిల గిల

Vijay Deverakonda : సితార ఎంట‌ర్టైన్మెంట్ ప‌తాకంపై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న చిత్రం కింగ్ డ‌మ్(Kingdom). ఇందులో కీల‌క పాత్ర‌లు పోషించారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, భాగ్య‌శ్రీ బోర్సే. సినిమాకు సంబంధించి మూవీ మేక‌ర్స్ తొలి పాట‌ను విడుద‌ల చేశారు. అద్భుతంగా స్వ‌ర క‌ల్ప‌న చేశారు. హృద‌యం లోప‌లా అంటూ కేకే రాశారు. రిలీజ్ అయిన ఈ సాంగ్ ఇప్ప‌టికే 20 మిలియ‌న్ల వీక్ష‌ణ‌ల‌ను దాట‌డం విశేషం. ఈ పాట ప్రోమో విడుద‌లైన రెండు రోజుల‌కే రికార్డ్ బ్రేక్ చేసింది.

Vijay Deverakonda – Bhagyashri Borse Kingdom Movie Song

ఈ సాంగ్ ఇంట‌ర్నెట్ ను షేక్ చేస్తోంది. ఒక ర‌కంగా తుఫాను రేపింది. పాట‌ల ప్రేమికుల‌ను క‌ట్టి ప‌డేసేలా చేసింది. ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌కు అద్దం ప‌ట్టింది ఈ చిత్రం. అద్బుత‌మైన స్పంద‌న రావ‌డంతో మూవీ మేక‌ర్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక రౌడీ బాయ్ ని డిఫ‌రెంట్ గా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు. అనిరుధ్ రవిచందర్ మరోసారి ఆత్మను కదిలించే శ్రావ్యతతో సరైన స్వ‌రాల‌ను కూర్చ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. గీత రచయిత కెకె మ‌రోసారి ఈ పాట‌కు ప్రాణం పోశాడ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇక పాట‌కు సంబంధించి కొరియోగ్రాఫ‌ర్ దార్ గై భావోద్వేగాల‌ను చిత్రీక‌రించిన తీరుకు ప్ర‌తి ఒక్క‌రు ఫిదా కావాల్సిందే. ఇక కింగ్ డ‌మ్ ను ఓ రేంజ్ లో చిత్రీక‌రించాడు ద‌ర్శకుడు గౌత‌మ్ తిన్న‌సూరి. ఇక త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో రాక్ స్టార్ గా గుర్తింపు పొందాడు అనిరుధ్ ర‌విచంద‌ర్. త‌ను టాప్ హీరోల‌కు ప‌ని చేశాడు. ఇక కింగ్ డ‌మ్ ను పూర్తిగా విజువ‌ల్ మేకింగ్ గా తీశాడు. గిరీష్ గంగాధ‌ర‌న్, జోమోన్ టి జాన్ సినిమాటోగ్ర‌ఫీ అత్యున్నత స్థాయిలో ఉంది. ఇక న‌వీన్ మాలి ఎడిటింగ్ కింగ్ డ‌మ్ కు హైలెట్ గా మారింది. సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Also Read : Hero Allu Arjun : విమ‌ర్శించ‌డం వ‌ల్ల‌నే సిక్స్ ప్యాక్ చేశా

CinemaKingdomUpdatesVijay DeverakondaViral
Comments (0)
Add Comment