Hero Vijay Deverakonda :రౌడీ కింగ్ డ‌మ్ ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో రెడీ

ప్ర‌క‌టించిన సినీ నిర్మాత నాగ‌వంశీ

Vijay Deverakonda : గౌత‌మ్ తిన్న‌సూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం కింగ్ డ‌మ్. సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇందులో కీ రోల్ పోషించాడు రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. త‌న‌తో పాటు భాగ్య‌శ్రీ బోర్సే న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఇండియాతో పాటు శ్రీ‌లంక‌లో కీల‌క‌మైన స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. ఈ సినిమాపై ఫుల్ హోప్స్ తో ఉన్నాడు సితార ఎంట‌ర్ టైన్మెంట్ అధినేత‌, ప్ర‌ముఖ నిర్మాత నాగ‌వంశీ. త‌మ బ్యాన‌ర్ లో వ‌స్తున్న భారీ మూవీగా పేర్కొన్నారు. కింగ్ డ‌మ్ చిత్రాన్ని మే 30వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Vijay Deverakonda Kingdom Movie Updates

త‌మిళ రాక్ స్టార్ అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ అందిస్తున్నాడు కింగ్ డ‌మ్ మూవీకి. ఈ సినిమా కు సంబంధించి విడుద‌ల చేసిన టీజ‌ర్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. విజ‌య్ దేవ‌ర‌కొండ(Vijay Deverakonda) మ‌న‌సు పెట్టి న‌టించాడు ఇందులో. త‌ను పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన లైగ‌ర్ ఆశించిన మేర ఆడ‌లేదు. ఆ త‌ర్వాత ఖుషీ చేశాడు. దానికి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. తాజాగా కింగ్ డ‌మ్ మూవీ మేక‌ర్స్ కీల‌క అప్ డేట్ ఇచ్చారు. అదేమిటంటే ఏప్రిల్ 30న బుధవారం చిత్రం ఫ‌స్ట్ సింగిల్ ప్రోమోను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

తాజాగా పోస్ట‌ర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇది మ‌రింత ఆక‌ట్టుకునేలా ఉంది. ఈ పోస్ట‌ర్ లో హీరోయిన్ తో విజ‌య్ దేవ‌ర‌కొండ కూర్చుని ఉండ‌డం మ‌రింత ఆస‌క్తిని రేపుతోంది. ఇక భాగ్య శ్రీ బోర్సే హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మిష్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీలో త‌ళుక్కున మెరిసింది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల‌కు బుక్కైంది. ప్ర‌స్తుతం కింగ్ డ‌మ్ పూర్తి కాగా రామ్ పోతినేనితో న‌టిస్తోంది. ఇదే కాంబోలో దిల్ రాజు నిర్మించే మ‌రో చిత్రం రౌడీ జ‌నార్ద‌న్ లో కీ రోల్ పోషించ‌నుంది. మొత్తంగా కింగ్ డ‌మ్ ఏ మేర‌కు రాణిస్తుందో విడుద‌లైతే కానీ చెప్ప‌లేం.

Also Read : Nilave Movie Sensational :ప్రేమ ఎంత మ‌ధురం ‘నిల‌వే’ అద్భుతం 

CinemaKingdomUpdatesVijay DeverakondaViral
Comments (0)
Add Comment