Hero Vijay Deverakonda-Rashmika :రాహుల్ మూవీలో దేవ‌ర‌కొండ‌..ర‌ష్మిక మంద‌న్న

మ‌రోసారి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్దం

Vijay Deverakonda : సినీ ఇండ‌స్ట్రీలో సూప‌ర్ పెయిర్ గా విజ‌య్ దేవర‌కొండ‌(Vijay Deverakonda), ర‌ష్మిక మంద‌న్నకు పేరుంది. ఈ ఇద్ద‌రూ క‌లిసి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గీత గోవిందం చిత్రం సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డ‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. దీనిని హీరో, హీరోయిన్లు ఖండించ‌లేదు. డియ‌ర్ కామ్రేడ్ లో కూడా ఈ జోడీ అల‌రించింది. ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది. ఆఫ్ స్క్రీన్ లో ప్రేమ పండింద‌ని, ఇద్ద‌రూ త్వ‌ర‌లోనే శుభం కార్డు కూడా వ‌స్తుంద‌ని భావిస్తున్నారు.

Vijay Deverakonda-Rashmika Mandanna Movie Updates

ఈ త‌రుణంలో తాజాగా కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా మూడో చిత్రంలో న‌టించ‌నున్నారు. ఈ విష‌యాన్ని మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దీనికి టైటిల్ కూడా ఖ‌రారు చేశారు. కార్డ్స్ అని టైటిల్ పెట్టారు. త్వ‌ర‌లోనే తెర‌పై క‌నిపించేందుకు రెడీ అయ్యారు. ఇదిలా ఉండ‌గా ర‌ష్మిక ఫుల్ బిజీగా ఉంది. మ‌రో వైపు విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా కింగ్ డ‌మ్ మూవీలో న‌టించాడు. ఇందులో భాగ్య‌శ్రీ బోర్సే కీ రోల్ పోషిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఇక ద‌ర్శ‌కుడు రాహుల్ సాంకృత్య‌న్ గతంలో టాక్సీవాలా, శ్యామ్ సింఘ‌రాయ్ సినిమాలు తీశాడు. ఈ రెండూ బిగ్ స‌క్సెస్ అయ్యాయి. హెచ్ఎంఎంఎల్ అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది సోష‌ల్ మీడియాలో. ఇదిలా ఉండ‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్ కార్డ్స్ ను నిర్మించేందుకు ముందుకు వ‌చ్చింద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం . మొత్తంగా క్రేజీ కాంబినేష‌న్ గా ఈ ఇద్ద‌రూ పేరు పొందారు.

Also Read : Ramesh Reddy Interesting Award :ఉత్త‌మ సినిమాటోగ్రాఫ‌ర్ గా ర‌మేష్ రెడ్డి

New MoviesRashmika MandannaUpdatesVijay DeverakondaViral
Comments (0)
Add Comment