Rowdy Boy – Kingdom :కింగ్ డ‌మ్ మూవీ జూలై 4కి వాయిదా

ప్ర‌క‌టించిన మూవీ మేక‌ర్స్

Kingdom : టాలీవుడ్ కు చెందిన యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన కింగ్ డ‌మ్ నుంచి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. త‌న‌తో పాటు భాగ్య‌శ్రీ బోర్సే క‌లిసి న‌టించిన ఈ చిత్రం వాస్త‌వానికి ఈనెల 30ననే విడుద‌ల కావాల్సి ఉంది. ఇప్ప‌టికే మూవీ మేక‌ర్స్ రివీల్ కూడా చేసేశారు. కానీ ఎందుక‌నో సినిమా రిలీజ్ డేట్ ను మ‌రింత ముందుకు జ‌రిపారు.

Kingdom Movie Updates

ఇక విజ‌య్ ని డిఫ‌రెంట్ గా ప్ర‌జెంట్ చేశాడు ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌సూరి. టీజ‌ర్ కు జ‌నం పిచ్చెక్కి పోయారు. ఇండియా, శ్రీ‌లంక లోని కీల‌క ప్ర‌దేశాల‌లో స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. విడుద‌లైన పాట సూప‌ర్ గా ఉందంటూ కామెంట్స్ వ‌చ్చాయి. మొత్తంగా పాజిటివ్ టాక్ ఇప్ప‌టి వ‌ర‌కు ఉంది ఈ చిత్రంపై. విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యానికి వ‌స్తే గ‌త కొన్నేళ్లుగా తాను మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.

పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన లైగ‌ర్ బిగ్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. ది ఫ్యామిలీ స్టార్ బొక్క బోల్తా ప‌డింది. గ‌తంలో న‌టించిన సినిమాలు త‌న‌కు మంచి పేరు తీసుకు వ‌చ్చేలా చేశాయి. క‌థ‌ల‌ను ఎంచు కోవ‌డంలో ట్రాక్ తప్పాడ‌ని టాక్ వ‌చ్చింది. ఇది ప‌క్క‌న పెడితే న‌ట‌నా ప‌రంగా త‌ను అన్నింటికీ స‌రి పోతాడ‌ని ఆ మ‌ధ్య‌న ఓ ద‌ర్శ‌కుడు కామెంట్ చేశాడు.

తాజాగా కింగ్ డ‌మ్(Kingdom) మూవీని సితార ఎంట‌ర్ టైన్మెంట్ నిర్మిస్తోంది. దీని అధినేత ప్ర‌ముఖ నిర్మాత నాగ‌వంశీ మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు చిత్రంపై. అంద‌రూ విజ‌య్ ని త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నార‌ని, కానీ త‌ను 100 శాతం క‌రెక్ట్ హీరో అని పేర్కొన్నాడు.

Also Read : Google New Logo :10 ఏళ్ల త‌ర్వాత గూగుల్ లోగో మార్పు

Bhagyashri BorseCinemaKingdomUpdatesVijay DeverakondaViral
Comments (0)
Add Comment