Hero Vijay Sethupathi-Rukmini :విజ‌య్ రుక్మిణి వ‌సంత్ ఏస్ ట్రైల‌ర్ రిలీజ్

మ‌న‌సు దోచుకునేలా చిత్రీక‌రించిన ద‌ర్శ‌కుడు

Vijay Sethupathi : త‌మిళ సినీ రంగంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త క‌లిగిన న‌టుడు విజ‌య్ సేతుప‌తి(Vijay Sethupathi). త‌ను ఎంచుకునే పాత్ర‌లు, క‌థ‌లు భిన్నంగా ఉంటాయి. త‌ను కీల‌క పాత్ర పోషించిన చిత్రం ఏస్. ఇందులో త‌న‌తో పాటు క‌థానాయిక‌గా న‌టించింది రుక్మిణి వ‌సంత్. ఫీల్ గుడ్ అనిపించేలా చిత్రీక‌రించాడు డైరెక్ట‌ర్. ప్ర‌తి క‌థ‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉండాలి. అంత‌కు మించి సామాజిక ప్ర‌యోజ‌నం ఉండాల‌ని ప‌రిత‌పించే న‌టుల‌లో సేతుప‌తి ఒక‌డు. అందుకే త‌న‌కు స‌క్సెస్ రేట్ ఎక్కువ‌. ఈ మ‌ధ్య‌నే కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తో క‌లిసి సినిమా చేస్తున్న‌ట్లు తెలిపాడు.

Vijay Sethupathi-Rukmini Vasanth ACE Movie Updates

ఇది విస్తు పోయేలా చేసింది. ఎందుకంటే న‌ట‌నా ప‌రంగా టాప్ లో కొన‌సాగుతున్న త‌రుణంలో ఎవ‌రైనా వ‌రుస వైఫ‌ల్యాల‌తో స‌త‌మ‌తం అవుతున్న ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తారా..కానీ విజ‌య్ సేతుప‌తి(Vijay Sethupathi) చేస్తున్నాడు. ఈ సంద‌ర్బంగా త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట పెట్టాడు. తాను ముందుగా క‌థ చూస్తాన‌ని, ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడి గురించి ఆలొచిస్తాన‌ని అన్నాడు. వైఫ‌ల్య‌మా స‌క్సెస్ అన్న‌ది ప‌ట్టించు కోనంటూ తెలిపాడు. ఇది త‌న స్టైల్. తాజాగా త‌ను, రుక్మిణి వ‌సంత్ క‌లిసి న‌టించిన బ్యూటిఫుల్ మూవీ ఏస్ ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది.

త‌న‌కు మ‌రో పేరు కూడా ఉంది. మ‌క్క‌ల్ సెల్వ‌న్ అని. ఆరుముగ‌కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ ఏస్ లో రుక్మిణి వ‌సంత్ కుమార్ తో పాటు మ‌రో ముఖ్య భూమిక పోషిస్తున్నాడు క‌మెడియ‌న్, విల‌క్ష‌ణ న‌టుడు యోగి బాబు. . 7సి ఎంట‌ర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ప‌తాకంపై దీనిని నిర్మించారు. ఇదిలా ఉండ‌గా మూవీ మేక‌ర్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మే23వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా ఏస్ మూవీని రిలీజ్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం విడుద‌ల చేసిన ఏస్ ట్రైల‌ర్ కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. సేతుప‌తి, రుక్మిణితో పాటు ఇత‌ర పాత్ర‌ల్లో దివ్య పిళ్లై, బ‌బ్లూ పృథ్వీరాజ్, అవినాష్‌, రాజ్ కుమార్, అల్విన్ మార్టిన్, కార్తీక్ జై, నాగుల‌న్ , త‌దిత‌రులు న‌టించారు.

Also Read : Director Maruthi Interesting :డైరెక్ట‌ర్ మారుతి మూవీ కీల‌క అప్ డేట్

CinemaRukmini VasanthUpdatesVijay SethupathiViral
Comments (0)
Add Comment