Arjun Son of Vyjayanthi Success :సినిమా స‌క్సెస్ రాములమ్మ ఖుష్‌

హీరోయిన్ల‌ను మీరు అని పిల‌వండి

Arjun Son of Vyjayanthi : లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. సినీ ఇండ‌స్ట్రీలో హీరో, హీరోయిన్ల ప‌ట్ల ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే దానిపై నోరు విప్పింది. ఆమె ముందు నుంచీ వాస్త‌వాల‌ను చెబుతుంది. త‌న‌కు ఏది తోస్తే అది మాట్లాడ‌టం అల‌వాటు. ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌దు. త‌ను తెలంగాణ ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా నిలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ఎమ్మెల్సీగా ఎంపిక‌య్యారు. ఇటీవ‌లే శాస‌న మండ‌లిలో ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఇదే స‌మ‌యంలో ఈ ఏడాది విజ‌య‌శాంతి(Vijayashanti)కి శుభంగా ప్రారంభ‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Arjun Son of Vyjayanthi Movie Success

క‌ళ్యాణ్ రామ్ తో పాటు త‌ను కూడా కీ రోల్ పోషించింది అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి(Arjun Son of Vyjayanthi) మూవీలో. ఈ సినిమా రిలీజ్ అయిన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. భారీ ఎత్తున క‌లెక్ష‌న్స్ సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఈ త‌రుణంలో సినిమా స‌క్సెస్ మీట్ పెట్టారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. సినీ ఇండ‌స్ట్రీలో గ‌త కొంత కాలంగా హీరోల‌ను ఒక లాగా హీరోయిన్ల‌ను మ‌రో లాగా చూడ‌టం దారుణ‌మ‌ని పేర్కొంది. హీరోల‌ను మీరు అంటూ సంబోదించ‌డం త‌మ‌ను మాత్రం నీవు అని పేర్కొన‌డం ప‌ట్ల అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది రాముల‌మ్మ‌.

ఇదిలా ఉండ‌గా త‌ను గ‌త కొంత కాలంగా రాజ‌కీయాల‌లో బిజీగా ఉన్నారు. ఆ స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి మినిమం గ్యారెంటీ క‌లిగిన డైరెక్ట‌ర్ గా గుర్తింపు పొందిన అనిల్ రావిపూడి విజ‌య‌శాంతిని సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేలా చేశాడు. ప్రిన్స్ మ‌హేష్ బాబు, ర‌ష్మిక మంద‌న్నా, సంగీత , రావు ర‌మేష్, బండ్ల గ‌ణేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన స‌రిలేరు నీకెవ్వురు మూవీలో త‌ల్లి పాత్ర‌లో న‌టింప చేశాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన మూవీ అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి. ఇది పూర్తిగా తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉన్న సెంటిమెంట్ ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు తీశాడు. బిగ్ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయ్యింది. సినిమా స‌క్సెస్ కావ‌డంతో రాములమ్మ ఫుల్ జోష్ లో ఉంది.

Also Read : Popular Actress Nazriya Nazim :అవార్డు మ‌రింత బాధ్య‌త‌ను పెంచేలా చేసింది

Arjun s/o VyjayanthiCinemaCollectionsTrendingUpdatesVijayashanti
Comments (0)
Add Comment