Akhanda 2 : బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నట సింహం బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం అఖండ 2 తాండవం శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలో కీ రోల్ పోషించింది విజయశాంతి. పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. ఇదే సమయంలో గతంలో ఎన్నో చిత్రాలలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు బాలయ్య, రాములమ్మ.
Vijayasanthi in Akhanda 2 Movie
అఖండ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో బోయపాటి శ్రీను సీక్వెల్ తీసేందుకు రెడీ అయ్యాడు. ఈ మధ్యన మహా కుంభమేళా జరిగిన సమయంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు బోయపాటి శ్రీను. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది విజయశాంతిని దర్శకుడు సంప్రదించాడని, అఖండ2లో నటించాలని కోరినట్లు దానికి తను కూడా ఓకే చెప్పినట్లు ఓ వార్త తెగ చెక్కర్లు కొడుతోంది.
ఈ సీక్వెల్ చిత్రంలో రాములమ్మ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట, గోపి అచంట నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక అఖండ 2 తాండవం మూవీని ఇదే ఏడాది సెప్టెంబర్ 28న పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు దర్శక, నిర్మాతలు.
Also Read : Popular Music Director Ilayaraaja :సంగీతం ఎలా వస్తోందో నాకు తెలియదు