Hero Vikram-Veera Dheera Sooran 2 :24న చియాన్ వీర ధీర సూర‌న్2 స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ వీడియోలో రానుంది

Veera Dheera Sooran 2 : త‌మిళ సినీ హీరో విక్ర‌మ్ చియాన్ కీ రోల్ పోషించిన చిత్రం వీర ధీర సూర‌న్ పార్ట్ -2 అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 24న స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ పూర్తిగా యాక్ష‌న్, థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకుంది. ఎస్ యు అరుణ్ కుమార్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో ఎస్ జే సూర్య‌, సూర‌జ్ వెంజ‌ర‌మూడు, దుషార విజ‌య‌న్ , పృథ్వీరాజ్ న‌టించారు. కీ రోల్స్ పోషించారు. ప్ర‌స్తుతం వీర ధీర సూర‌న్(Veera Dheera Sooran 2) పార్ట్ -2 మూవీ త‌మిళంలో అందుబాటులో ఉంది.

Vikram-Veera Dheera Sooran 2Movie Updates

దీనిని త్వ‌ర‌లోనే తెలుగు, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల‌లో డ‌బ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ‌. క‌థా ప‌రంగా చూస్తే మ‌ధురైలో ఒక ఆలయ ఉత్స‌వం సంద‌ర్బంగా కాళీ అనే షాప్ య‌జ‌మానిని అనుస‌రిస్తుంది. త‌న నేర పూరిత గ‌తాన్ని విడిచి పెట్టాడు. ఇదే స‌మ‌యంలో మాజీ క్రైమ్ బాస్ పెరియ‌వ‌ర్ ర‌వి తిరిగి క‌నిపిస్తాడు. దీంతో కాళీని నేరాల ప్ర‌పంచంలోకి వ‌చ్చేలా చేస్తాడు.

కాళి ఎస్పీ అరుణ‌గిరిని తొల‌గించేందుకు ప్ర‌మాద‌క‌ర‌మైన మిష‌న్ లోకి త‌ను ఎంట్రీ ఇస్తాడు. ఈ స‌మ‌యంలో త‌న కుటుంబాన్ని ర‌క్షించుకుంటూనే అన్ని వైపుల నుంచి బెదిరింపుల‌ను ఎదుర్కొంటాడు. త‌న‌ను తాను సేవ్ చేసుకుంటాడా లేక లొంగి పోతాడా, చివ‌ర‌కు ఇచ్చిన టాస్క్ ను స‌క్సెస్ చేశాడా అనేది తెలుసు కోవాలంటే చియాన్ న‌టించిన వీర ధీర సూర‌న్ 2ను చూసి తీరాల్సిందే. గ‌తంలో వ‌చ్చిన మూవీకి ఇది సీక్వెల్. మంచి ఫీల్ గుడ్ క‌ల్పించిన మూవీ. వీలైతే ఓటీటీలో చూడండి.

Also Read : Hero Simbu-Trisha :ప‌దిహేనేళ్ల త‌ర్వాత త్రిష‌..శింబు క‌ల‌యిక‌

Chiyaan VikramCinemaTrendingUpdatesVeera Dheera Soora
Comments (0)
Add Comment