Virat Kohli Assets Sensational :విరాట్ కోహ్లీ నిక‌ర ఆస్తుల విలువ రూ. 1000 కోట్లు

క‌ళ్లు చెదిరే ఆట తీరుతో కోట్లాది మందికి ఆరాధ్య‌దైవం

Virat Kohli : హైద‌రాబాద్ – భార‌త దేశంలో మ‌తం కంటే ఎక్కువ‌గా అభిమానించే ఏకైక ఆట క్రికెట్. కోట్లాది మందిని కుల‌, మ‌తాలు, ప్రాంతాల‌కు అతీతంగా అభిమానించే కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావించే క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ. త‌ను క్రికెట్ మూడు ఫార్మాట్ ల‌లో రెండింటి నుంచి వైదొలిగాడు. త‌ను ఇంకా మూడేళ్ల పాటు ఆడాల్సి ఉన్నా ఎందుక‌నో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో తాను టెస్టు క్రికెట్ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం విరాట్ కోహ్లీ(Virat Kohli) బ్రాండ్ వాల్యూ అంత‌కంత‌కూ పెరుగుతోందే త‌ప్పా ఎంత‌కూ త‌గ్గ‌డం లేదు.

Virat Kohli Assets Sensational

తాజాగా క్రికెట్ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు కోహ్లీ నిక‌ర ఆస్తుల విలువ దాదాపు రూ. 1000 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా. ఇత‌ర ఆట‌గాళ్ల‌లో రోహిత్ శ‌ర్మ కంటే మ‌హేంద్ర సింగ్ ధోనీ మార్కెట్ వాల్యూ కోహ్లీతో స‌రిపోయేలా ఉంటుంద‌ని టాక్. ఇది ప‌క్క‌న పెడితే ఆట‌ను ఎలా ఆడాలో, విజ‌యం సాధించేంత వ‌ర‌కు ఎక్కడా ఎవ‌రికీ త‌ల వంచ‌కూడ‌ద‌ని త‌న ఆట‌తీరుతో తెలియ చేశాడు కోహ్లీ. త‌ను మైదానంలో ఉంటే రాకెట్ కంటే స్పీడ్ గా క‌దులుతాడు. బ్యాటింగ్ చేస్తుంటే ప‌రుగుల వ‌ర‌ద పారిస్తాడు. సిక్సులు, ఫోర్లు అల‌వోక‌గా కొడ‌తాడు. అందుకే త‌న‌కు ర‌న్ మెషీన్ అన్న పేరు వ‌చ్చింది.

ప్ర‌పంచ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన క్రికెట‌ర్ల‌లో టాప్ లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. విచిత్రం ఏమిటంటే దాయాది పాకిస్తాన్ లో ఆ దేశ క్రికెట‌ర్ల కంటే ఎక్కువ‌గా ప్రేమించే ఏకైక క్రికెట‌ర్ త‌ను కావ‌డం విస్తు పోయేలా చేస్తోంది. పోరాటానికి ప్ర‌తిరూపంగా నిలిచే కోహ్లీ అంటే త‌మ‌కు ఇష్ట‌మ‌ని పాకిస్తాన్ ఫ్యాన్స్ చెబుతుండ‌డం విశేషం. విల్లాలు, కార్లు, లెక్కించ లేనంత‌గా కంపెనీల‌కు యాడ్స్ చేస్తుంటాడు కోహ్లీ. మొత్తంగా కోహ్లీ మామూలోడు కాద‌ని తేలి పోయింది.

Also Read : TTD Chairman-Br Naidu Shocking :టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు ఆక‌స్మిక త‌నిఖీ

BreakingNational NewsUpdatesViralVirat Kohli
Comments (0)
Add Comment