Virgin Boys-Comedy Sensational :వ‌ర్జిన్ బాయ్స్ కామెడీ అదుర్స్

న‌వ్వులు పూయించ‌నున్న మూవీ

Virgin Boys : ఈ మ‌ధ్య‌న సినిమాలు పూర్తిగా కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ జాన‌ర్ లో వ‌స్తున్నాయి. ప్రేక్ష‌కులు కూడా త‌మ అభిరుచుల‌ను మార్చుకుంటున్నారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ న‌టించిన మారిముత్తు తీసిన డ్రాగ‌న్ సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. ఆ త‌ర్వాత పోక్సో చ‌ట్టం ప్ర‌ధాన క‌థ‌తో తీసిన మూవీ కోర్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇక సితార ఎంట‌ర్ టైన‌ర్ పతాకంపై నాగ‌వంశీ నిర్మించిన మూవీ మ్యాడ్ స్క్వేర్ కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. దీంతో సినీ ఇండస్ట్రీలో నిర్మాత‌లు పూర్తిగా వినోదాన్ని పండించేందుకు ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తున్నారు.

Virgin Boys – Comedy Sensational

దీంతో క‌థ‌లు రాసే ప‌నిలో ప‌డ్డారు ర‌చ‌యిత‌లు. ఇంటిల్లిపాది క‌లిసి చూసే మూవీస్ ను తీసే ప్ర‌య‌త్నంలో ప‌డ్డారు ద‌ర్శ‌కులు. సీనియ‌ర్ ద‌ర్శ‌కుల‌ను ప‌క్క‌న పెడితే పూర్తిగా టాలెంట్, దమ్మున్న యంగ్ ద‌ర్శ‌కుల‌కు ఫుల్ ఛాన్స్ లు దొరుకుతున్నాయి. కొత్త క‌థ‌లు, సినిమాల రూపంలో. ఇలాంటి కోవ‌లోకి వ‌చ్చిందే వ‌ర్జిన్ బాయ్స్(Virgin Boys). విచిత్రం ఏమిటంటే ఇది పూర్తిగా వినోదం పండించేందుకు రెడీ అయ్యింది. పోస్ట‌ర్ కూడా డిఫ‌రెంట్ గా త‌యారు చేశారు. ఇది వైరల్ గా మారింది. అమ్మాయి పెద‌వుల మీద ముగ్గురు అబ్బాయిలు ఉండ‌డం ఒకింత డిఫ‌రెంట్ గా ఆలోచించేలా చేసింది .

గీతా నంద్, మిత్రా శ‌ర్మ వ‌ర్జిన్ బాయ్స్ లో కీ రోల్స్ పోషించారు. రాజ్ గురు ఫిలిమ్స్ ప‌తాకంపై రాజా ద‌ర‌పునేని నిర్మిస్తుండగా దీనికి ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌త్యేకించి యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన‌ట్లు అర్థం అవుతుంది. ఇక ట్యాగ్ లైన్ కూడా మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించేలా ఉండ‌డం ఈ మూవీకి ప్ల‌స్ పాయింట్ . బ్రో ఆర్ యూ వ‌ర్జిన్ అనే ది . ఇక వ‌ర్జిన్ బాయ్స్ మూవీ ప్ర‌మోష‌న్స్ ను ప్రారంభించారు. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు మూవీ మేక‌ర్స్.

Also Read : Beauty Tamannaah-Odela 2 :ఓదెల 2 ట్రైల‌ర్ అదుర్స్ త‌మ‌న్నా నో కామెంట్స్

comedy movieUpdatesViralVirgin Boys
Comments (0)
Add Comment