Devi Sri Prasad-Vizag CP Shocking :దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ కచేరికి నో ఛాన్స్

తీవ్ర నిరాశ‌కు గురి చేసిన నిర్ణ‌యం

Devi Sri Prasad : మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్ కు షాక్ త‌గిలింది. ఈనెల 19న త‌న ఆధ్వ‌ర్యంలో మ్యూజిక్ క‌చేరి నిర్వ‌హించేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఇందుకు వేదిక కానుంది విశాఖ‌ప‌ట్నం. నిర్వాహ‌కులు ఇప్ప‌టికే త‌న షో గురించి ప‌ర్మిష‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అయితే అనూహ్యంగా విశాఖ అధికారులు అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఎంతో ప్ర‌య‌త్నం చేసినా వ‌ర్క‌వుట్ కాలేదు. దీంతో తీవ్ర నిరాశ‌కు లోన‌య్యాడు దేవిశ్రీ ప్ర‌సాద్.

Devi Sri Prasad Music Event in Vizag-CP Not Given Permission

త‌న‌కు తెలిసిన వారితో, ఇత‌రుల‌తో ప్ర‌య‌త్నాలు కూడా చేసిన‌ట్లు స‌మాచారం. మ్యూజిక‌ల్ నైట్ నిర్వ‌హించేందుకు వీలు లేదంటూ అభ్యంత‌రం తెలిపారు. వైజాగ్ పోలీసులు ఇందుకు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌ర్మిష‌న్ ఇచ్చేందుకు ఒప్పుకునేది లేదంటూ స్ప‌ష్టం చేశారు సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్(Devi Sri Prasad) కు.

విశాఖ‌లోని స్పోర్ట్స్ క్ల‌బ్ లో ఈ మ్యూజిక‌ల్ నైట్ నిర్వహించాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా చేశారు. దేవిశ్రీ‌కి ఉన్న స్టార్ ఇమేజ్ దృష్ట్యా పెద్ద ఎత్తున లైవ్ షో టికెట్స్ అమ్ముడు పోయాయి. ఆన్ లైన‌ట్ లో. కాగా న‌గ‌రంలో సెక్యూరిటీ ప‌రంగా అనుమ‌తి ఇచ్చేది లేద‌ని తేల్చి చెప్పారు పోలీస్ క‌మిష‌న‌ర్ శంఖ‌బ్ర‌త బాగ్చి . అయితే షోను మారుస్తారా లేక వాయిదా వేస్తారా అన్న‌ది చూడాలి.

Also Read : Hero Jonnalagadda-Telusu Kada :జొన్న‌ల‌గ‌డ్డ ‘తెలుసు క‌దా’

Comments (0)
Add Comment