Vyiham Movie : ‘వ్యూహం’ ఆర్జీవీ సంచ‌ల‌నం

ఓటీటీలోకి ఇక చిత్రం

Vyiham Movie : వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏది చేసినా అది ఓ సంచ‌ల‌న‌మే అవుతుంది. తాను తాజాగా తీసిన వ్యూహం సినిమాకు సంబంధించి బిగ్ షాక్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సినిమాలో ప్ర‌యోగించిన పాత్ర‌లు నిజ జీవితంలో కొంద‌రి వ్య‌క్తుల‌ను పోలి ఉన్నాయంటూ పేర్కొంది. పాత్ర‌ల‌కు నేత‌ల పేర్లు పెట్డ‌డంపై తీవ్ర అభ్యంత‌రం తెలిపింది.

Vyiham Movie Updates

అంతే కాకుండా జ‌రుగుతున్న కాలానికి సంబంధించిన అంశాల‌నే ప్రాతిప‌దిక‌గా తీసుకుని క‌థ‌ను తీసుకోవడాన్ని త‌ప్పు ప‌ట్టింది. దీంతో రివైజింగ్ క‌మిటీకి ద‌ర‌ఖాస్తు చేసిన‌ట్లు వ్యూహం మూవీ మేక‌ర్స్ వెల్ల‌డించారు.

ఇదిలా ఉండ‌గా తాను తీసిన వ్యూహం రాకుండా చేసిన సెన్సార్ బోర్డుకు దిమ్మ తిరిగేలా స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు రామ్ గోపాల్ వ‌ర్మ‌(Ram Gopal Varma). త‌న చిత్రాన్ని ఎలాంటి క‌ట్స్ లేకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తానంటూ ప్ర‌క‌టించారు. దీంతో వ‌ర్మ‌నా మ‌జాకా అంటున్నారు తెలిసిన వారంతా.

త‌ను ఇప్ప‌టికే సినిమా పట్ల‌, ఆ రంగం ప‌ట్ల అపార‌మైన అనుభ‌వం క‌లిగి ఉన్నారు. ఎలాంటి సెన్సార్ బోర్డు అనుమ‌తి లేకుండానే నేరుగా ఓటీటీలో వ్యూహం సినిమాను చూసేందుకు వీలు క‌లుగుతుంది.

Also Read : Habibi Jilebi Song : హ‌బీబీ జిలేబీ సాంగ్ రిలీజ్

Comments (0)
Add Comment