Vyooham: మార్చి 2న ఆర్జీవీ ‘వ్యూహం’ !

మార్చి 2న ఆర్జీవీ 'వ్యూహం' !

Vyooham: రామదూత క్రియేషన్స్‌ బ్యానర్‌పై దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మాతగా వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన సినిమాలు ‘వ్యూహం’, ‘శపథం’. 2009 నుంచి 2019 ఎన్నికల వరకు ఏపి సిఎం వైఎస్ జగన్ కు సంబందించిన పలు సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామాను గతేడాది డిసెంబరు 29న విడుదల చేస్తున్నట్లు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రకటించారు. అంతేకాదు వ్యూహం సినిమాకి కొనసాగింపు గా “శపథం ” సినిమాను జనవరి నెలలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Vyooham Movie Updates

అజ్మల్ అమీర్, ధనంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, రేఖ సురేఖ ప్రధాన పాత్రల్లో పొలిటికల్ సెటైరికల్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో… టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించ పరిచే విదంగా ఉన్నట్లు ట్రైలర్ లో తెలుస్తోంది. గతంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వంగవీటి, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, లక్ష్మీస్‌ ఎన్టీఆర్ సినిమాల్లో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా పాత్రలను సృష్టించారు. దీనితో ‘వ్యూహం(Vyooham)’ సినిమా విడుదలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ సినిమాల విడుదలకు బ్రేకులు వేస్తూ వచ్చింది.

తొలుత న్యాయపరమైన కారణాలతో వాయిదా పడ్ద ఈ సినిమా… ఆ తరువాత సాంకేతిక కారణాలతో పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాను మార్చి 2న విడుదల చేస్తున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అంతేకాదు ‘వ్యూహం(Vyooham)’ సినిమా విడుదలపై… ‘పట్టు వదలని విక్రమార్కుడిని’ అని క్యాప్షన్‌తో పాటు సెన్సార్ సర్టిఫికెట్‌ని చేతిలో పట్టుకున‍్న ఫొటోని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆర్జీవి పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ‘వ్యూహం’ని ఫిబ్రవరి 23న, ‘శపథం’ని మార్చి 1న రిలీజ్ చేయబోతున్నట్లు ఆర్జీవి ప్రకటించారు. కానీ మళ్ళీ పది రోజుల తరువాత ఆ రిలీజ్స్ ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వ్యూహం సినిమాని మార్చి 1కి, శపథం మూవీని మార్చి 8కి తీసుకు వస్తామంటూ కొత్త రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మరోసారి డేట్ ని మారుస్తూ ఆర్జీవీ అనౌన్స్ చేశారు.

Also Read : Kangana Ranaut: ప్రత్యక్ష రాజకీయాల్లోకి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా ?

Ram Gopal VarmaVyooham
Comments (0)
Add Comment