Mangalavaaram: ‘మంగళవారం’ కు భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ దెబ్బ

'మంగళవారం' కు భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ దెబ్బ

‘మంగళవారం’ కు భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ దెబ్బ

Mangalavaaram: తెలుగు ప్రజలకు ఎంటర్ టైన్ మెంట్ అంటే ముందుగా గుర్తొచ్చేది సినిమా… ఆ తరువాత క్రికెట్… అందుకే టాలీవుడ్ నిర్మాతలు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు, ఐపిఎల్ మ్యాచ్ లను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి సినిమాలను విడుదల చేస్తుంటారు. అయితే ప్రపంచ కప్ -2023ను ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్ ను ఊహించలేదో ఏమో గాని “ఆర్ఎక్స్ 100” ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో “మంగళవారం” సినిమాను నవంబరు 17 శుక్రవారం నాడు విడుదల చేసారు. అయితే మంచి పాజిటివ్ టాక్ తో శుక్రవారం మంచి వసూళ్ళు సాధించిన “మంగళవారం” సినిమా… భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ పుణ్యమా అంటూ శని, ఆదివారాల వసూళ్లకు భారీగా గండిపడింది.

Mangalavaaram – భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ వైబ్ తెలుగు రాష్ట్రాలు- “మంగళవారం” కు భారీగా తగ్గిన వసూళ్లు

అజయ్ భూపతి-పాయల్ రాజ్ పుత్ కాంబోలో వచ్చిన రెండో చిత్రం “మంగళవారం” పై మంచి బజ్ క్రియేట్ కావడంతో పాటు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే అయ్యింది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు కూడా మంచి వసూళ్లు సాధించింది. అయితే ఆదివారం భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ఉండటంతో శనివారం నుండే తెలుగు రాష్ట్రాల ప్రజలు మ్యాచ్ వైబ్ లోనికి వెళ్ళిపోయారు. అయితే ఫలితం తారుమారు అవ్వడంతో సోమవారం కూడా ఆ మ్యాచ్ నుండి తేరుకోలేపోతున్నారు.

దీనితో భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ దెబ్బ “మంగళవారం” సినిమాపై భారీగా పడింది. వీక్ ఎండ్ డేస్ లో “మంగళవారం(Mangalavaaram)” సినిమా కనీసం మూడు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేస్తుందని ఆశించిన డిస్ట్రీబ్యూటర్లకు, నిర్మాతలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మ్యాచ్ ప్రభావంతో సినిమా వసూళ్లు కోటి లోపలే ఉండటంతో వారు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రాబోయే వీక్ డేస్ లో అయినా ప్రేక్షకులు “మంగళవారం” సినిమా థియేటర్ల మెట్లు ఎక్కితే ఫరవాలేదు… లేదంటే హిట్ సినిమాకు కూడా నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి తప్పేట్లు లేదంటూ నిర్మాతలు భయపడుతున్నారు.

Also Read : Vetrimaaran: సినిమా రివ్యూలపై వెట్రిమారన్ సంచలన వ్యాఖ్యలు

Ajay BhupathiMangalavaaramPayalPayal Rajput
Comments (0)
Add Comment