టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ఓ వైపు సోదరుడు ఆనంద్ దేవరకొండ ఎవరినీ పట్టించుకోకుండా తమంతకు తాముగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. గత ఏడాది ఆనంద్ , వైష్ణవి చైతన్యతో కలిసి నటించిన బేబీ మూవీ బిగ్ సక్సెస్ గా నిలిచింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. యువతను ఆకట్టుకుంది విపరీతంగా. తాజాగా నైంటీస్, ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సీరీస్ లు జనాదరణ పొందాయి.
వీటికి దర్శకత్వం వహించాడు ఆదిత్య హాసన్. తన టాలెంట్ ను గుర్తించింది ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్. తనతో సినిమా తీసేందుకు ముందుకు వచ్చింది. ఇక వైష్ణవి చైతన్య, సిద్దు జొన్నలగడ్డ నటించిన మూవీ జాక్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. కానీ వర్కవుట్ కాలేదు. పూర్తిగా డిజాస్టర్ గా నిలిచింది.
అయినా వైష్ణవి చైతన్యకు బంపర్ ఆఫర్ వచ్చింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఫుల్ జోష్ లో ఉంది.
బూతులు సర్వ సాధరణం అయి పోయాయి. వీటిని వాడడం ఓ స్టేటస్ సింబల్ గా మారి పోయింది. ఈ అమ్మడు కూడా దానికి ఓకే చెప్పడంతో ఛాన్స్ లు వస్తున్నాయి. తాజాగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి తో కలిసి హాసన్ తో మూవీ ప్రారంభమైంది. గురువారం సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా హాజరైంది రష్మిక మందన్నా. తను క్లాప్ కొట్టగా శివాజీ కెమెరా కెమెరా స్విచ్ ఆన్ చేశాడు.