Ananya Panday : ప్రముఖ బాలీవుడ్ నటుడు చంకీ పాండే తనయ అనన్య పాండే(Ananya Panday) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ముద్దుగుమ్మ ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాత్ తీసిన లైగర్ లో కీ రోల్ పోషించింది. అందాలను ఆరబోసింది కూడా. ఆ మధ్యన ఈవెంట్స్ కు కూడా హాజరైంది. ఇదే సమయంలో ఈ సినిమాలో రౌడీ విజయ్ దేవరకొండ నటించాడు. కానీ ఆశించిన మేర ఆడలేదు. బిగ్ డిజాస్టర్ గా మిగిలింది. క్యాంపెయిన్ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తను కూడా నిరాశకు లోనైంది అనన్య పాండే.
Ananya Panday Comments
అయితే తాజాగా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది యధార్థ కథను ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రం కేసరి -2. ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ టాక్ రావడం, భారీ ఎత్తున ప్రేక్షకులు ఓన్ చేసుకోవడం, కలెక్షన్ల వర్షం కురిపించడం జరిగింది. అంతే కాకుండా కేసరి 2 మూవీలో ముఖ్యమైన పాత్రను పోషించింది అనన్య పాండే. ఈ సందర్బంగా చిట్ చాట్ చేసింది. తన మనసులోని భావాలను వ్యక్తం చేసింది ఈ ముద్దుగుమ్మ.
తాను గతంలో కొన్ని తప్పులు చేశానని, పాత్రలను ఎంచు కోవడంలో అంతగా దృష్టి పెట్టలేదని తెలిపింది. అయితే కేసరి 2 లో ఇచ్చిన పాత్ర తనకు మంచి పేరు తీసుకు వచ్చేలా చేసిందని , ఆ పాత్రను తాను మరిచి పోలేనంటూ స్పష్టం చేసింది. ఇక నుంచి కథలో బలమైన పాత్ర ఉంటేనే ఓకే చేస్తానని లేదంటే ఒప్పుకోనంటోంది కుండ బద్దలు కొట్టింది.
Also Read : Beauty Shraddha Kapoor -Neel :ప్రశాంత్ నీల్ మూవీలో శ్రద్దా కపూర్