Ananya Panday: విజయ్ దేవరకొండ ‘లైగర్’తో తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈమె ఇప్పుడు బాధలో ఉండిపోయింది. తన పెంపుడు శునకం చనిపోవడంతో ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. 2008 నుంచి ఫడ్జ్ అనే పెంపుడు కుక్క అనన్య పాండే ఇంట్లో ఉంది. ఇప్పుడు అది చనిపోయింది. ఈ మేరకు తన పెట్ డాగ్ తో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, కొన్ని జ్ఞాపకాల్ని పంచుకుంది. ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతా అని కాస్త ఎమోషనల్ అయింది.
Ananya Panday Post
‘లైగర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే(Ananya Panday). ఆమె హిందీ సినిమా నటుడు చుంకీ పాండే కూతురు, శరద్ పాండే మనుమరాలు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ… ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన లైగర్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఇటీవల బ్యాడ్ న్యూజ్ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది. ఈ మూవీలో విక్కీ కౌశల్, త్రిప్తి డిమ్రీ జంటగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. అంతే కాకుండా కాల్ మీ బే అనే వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అనన్య తండ్రి చుంకీ పాండే కూడా నటుడే. బాలీవుడ్ లో ఎప్పటినుంచో ఉన్నాడు. ప్రభాస్ ‘సాహో’ మూవీలో కూడా విలన్ క్యారెక్టర్ చేశాడు.
Also Read : Singham Again: ‘సింగమ్ అగైన్’లో ప్రభాస్ ?
