అనసూయ భరద్వాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె అటు బుల్లి తెరపై ఇటు వెండి తెరపై తన టాలెంట్ తో ఆకట్టుకుంటోంది. యాంకర్ గా , నటిగా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు కష్ట పడుతోంది. ఇప్పటికే రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో పాపులర్ గా అయ్యింది.
ఆ తర్వాత కొన్ని సినిమాలలో భిన్నమైన పాత్రలను ఎంచుకుంటోంది. తన కెరీర్ ను ముందుకు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటోంది అనసూయ భరద్వాజ్.
తాజాగా అఖండ లాంటి బిగ్ హిట్ మూవీని అందించిన ద్వారకా క్రియేషన్స్ ఆధ్వర్యంలో ప్రస్తుతం పెదకాపులో నటించింది. ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది అనసూయ భరద్వాజ్. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. నెగటివ్ రోల్స్ లో నటించినంత మాత్రాన ఏమీ కాదన్నారు. ఇంకా మంచి పేరు వస్తుందని తాను అనుకుంటున్నట్లు చెప్పారు.
నటి అన్నాక అన్ని పాత్రలలో చేయాల్సి ఉంటుందన్నారు. అప్పుడే న్యాయం చేసినట్లు అవుతుందని స్పష్టం చేశారు అనసూయ భరద్వాజ్. ఇదిలా ఉండగా పెదకాపు -1లో వేశ్య పాత్ర చేసినట్లు టాక్. దీనిపై స్పందించిన అనసూయ షాకింగ్ కామెంట్స్ చేసింది. వేశ్య పాత్ర చేస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించింది.
