టాలీవుడ్ లో క్రియేటివిటీ కలిగిన దర్శకులలో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. తాజాగా పెదకాపు-1 పేరుతో సినిమా తీశాడు. సెప్టెంబర్ 29న విడుదల కానుంది. ఇప్పటికే మూవీ మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. కథతో పాటు తనే దర్శకత్వం వహించాడు డైరెక్టర్.
స్వతహాగా రచయిత కావడంతో మాటలు కూడా మరింత పదునుగా ఉండేలా జాగ్రత్త పడ్డాడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్స్ , ట్రైలర్ మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. దర్శకుడు తన పనితనాన్ని తెరపై చూపించాడు.
2 గంటల 25 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పెదకాపు మూవీలో విరాట్ కర్ణ, నాగేంద్ర బాబు, ఈశ్వరి రావు, ప్రగతి శ్రీవాస్తవ, తనికెళ్ల భరణి, రావు రమేష్, ఆడు కలం నరేష్ , రాజీవ్ కనకాల , అనుసూయ భరద్వాజ్ నటించారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ మూవీని నిర్మించిన రవీందర్ రెడ్డి ఈ పెదకాపు చిత్రానికి నిర్మాతగా ఉన్నారు. మొత్తంగా పెద కాపు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.