పెళ్లి కాకుంటే ఆ హీరోతో డేటింగ్ చేసేదాన్ని

ఓపెన్ అప్ అయిన బ్యూటీ అన‌సూయ భ‌ర‌ద్వాజ్

యాంక‌ర్ గా త‌న జీవితాన్ని ప్రారంభించి ఆ త‌ర్వాత న‌టిగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంటూ అడ‌పా ద‌డ‌పా ఈవెంట్స్ కు అటెండ్ అవుతూ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారి పోయింది అన‌సూయ భ‌ర‌ద్వాజ్. త‌ను కొన్ని చిత్రాల‌లో న‌టించింది. రామ్ చ‌ర‌ణ్ , స‌మంత రుత్ ప్ర‌భుతో క‌లిసి న‌టించింది రంగ‌స్థ‌లం చిత్రంలో. ఈ సినిమా మంచి ఆద‌ర‌ణ పొందింది. దీనికి ద‌ర్శ‌కుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో కీ రోల్ పోషించింది అన‌సూయ భ‌ర‌ద్వాజ్.

బిగ్ స‌క్సెస్ కావ‌డంతో వ‌రుస‌గా ఛాన్స్ లు రావ‌డం ప్రారంభం అయ్యాయి. స‌మ‌యం కుదిరితే చాలు ఈవెంట్స్ లో త‌ళుక్కున మెరుస్తోంది. త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్పేస్తుంది. ఇదే స‌మ‌యంలో త‌ను అక్కినేని నాగార్జున‌తో సోగ్గాడే చిన్ని నాయినాలో న‌టించింది. మంచి మార్కులు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత తెలంగాణ ప్రాంతం ఆధారంగా తెరెకెక్కించిన చిత్రం ర‌జాకార్ మూవీలో అద్భుతంగా న‌టించింది. మంచి పేరు తెచ్చేలా చేసింది. ఇక సోష‌ల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది.

అంతే కాదు ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు సంబంధించిన ఫోటోల‌ను కూడా షేర్ చేస్తూ వ‌స్తోంది. మొత్తంగా పాపులారిటీలో టాప్ లో కొన‌సాగుతోంది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా యాంక‌ర్స్ ర‌వి, శ్రీ‌ముఖితో జ‌రిగిన చిట్ చాట్ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది అన‌సూయ భ‌ర‌ద్వాజ్. ఒక‌వేళ పెళ్లి కాక పోయి ఉండి ఉంటే టాలీవుడ్ లో ఏ హీరోతో మీరు డేటింగ్ చేయాల‌ని అనుకుంటున్నార‌న్న ప్ర‌శ్న‌కు జ‌డుసుకోకుండా స‌మాధానం ఇచ్చింది . త‌న‌కు రామ్ చ‌ర‌ణ్ అంటే ఇష్ట‌మ‌ని, త‌న‌తో డేటింగ్ చేసి ఉండేదానిని అంటూ పేర్కొంది. తాజాగా అన‌సూయ భ‌ర‌ద్వాజ్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com