గృహ ప్ర‌వేశం చేసిన రంగ‌మ్మ‌త్త‌

సోష‌ల్ మీడియాలో ఫోటోలు వైరల్

 

ప్ర‌ముఖ యాంక‌ర్, న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ అలియాస్ అంద‌రూ ప్రేమ‌గా పిలుచుకునే రంగ‌మ్మ‌త్త వైర‌ల్ గా మారింది. దీనికి కార‌ణం త‌ను ఇటీవ‌ల కొత్త ఇంటిని భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది. కుటుంబ స‌మేతంగా గృహ ప్ర‌వేశం చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. యాంక‌ర్ గా, ఈవెంట్స్ ల‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. అంతేకాకుండా అడ‌పా ద‌డ‌పా త‌న అభిప్రాయాల‌ను పంచుకుంటోంది. నిత్యం వార్త‌ల్లో ఉండేలా చూసుకుంటోంది. మొత్తంగా ఉన్నది ఉన్న‌ట్టు మాట్లాడేస్తోంది.

త‌ను ఏది మాట్లాడినా అది క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతోంది. త‌న‌కు పెద్ద ఎత్తున ఫాలోవ‌ర్స్ ఉంటున్నారు. ఇన్ స్టా ఖాతాలో ఎక్కువ మంది త‌న‌ను అనుస‌రిస్తున్నారు. త‌ను సోగ్గాడే చిన్ని నాయ‌నా , రంగ‌స్థ‌లం , త‌దిత‌ర సినిమాల‌లో న‌టించింది. ప్ర‌త్యేకించి తెలంగాణ చ‌రిత్ర‌లో అత్యంత విషాద‌క‌ర‌మైన ర‌జాకార్లు సాగించిన దారుణాల‌ను తెర‌కెక్కించిన చిత్రం ర‌జాకార్. ఇందులో కీ రోల్ పోషించింది అనసూయ భ‌ర‌ద్వాజ్.

త‌ను నిత్యం ఫోటోల‌ను అప్ డేట్ చేస్తుంది. అభిప్రాయాల‌ను పంచుకుంటుంది. అంత‌కు మించి పంచ్ లు కూడా విసురుతుంది. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దు కోవాల‌ని త‌న‌ను తాను ప్రూవ్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేసింది. ఈ మేర‌కు న‌గ‌రంలో అత్యంత విలాస‌వంత‌మైన ఇంటిని కొనుగోలు చేసింది. అంద‌రినీ విస్తు పోయేలా చేసేసింది ఈ ముద్దుగుమ్మ‌.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com