ప్రేమ కథలకు ఎల్లప్పటికీ డిమాండ్ ఉంటుంది. కానీ చెప్పే పద్దతిని బట్టి సినిమా సక్సెస్ అవుతుంది. అదంతా దర్శకుడి టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు వచ్చిన ప్రేమసాగరం, మరో చరిత్ర సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆ తర్వాత వచ్చిన లవ్ మూవీస్ కు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. కేవలం తక్కువ బడ్జెట్ తో తయారైన సినిమాలు సైతం పెద్ద సినిమాలతో పోటీపడి సక్సెస్ అయ్యాయి.
ఆ మధ్యన ప్రేక్షకుల ముందుకు వచ్చిన 7/G బృందావన్ కాలనీ మూవీ సంచలనం సృష్టించింది. కాసుల వర్షం కురిపించింది. ఇందులో నటించిన నటీ నటులకు మంచి పేరు కూడా వచ్చేలా చేసింది. ఇదిలా ఉండగా ఇప్పుడు కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. అదేమిటంటే ఒకప్పుడు బంపర్ హిట్ అయిన సినిమాలను రీ రీలీజ్ చేస్తున్నారు. ఇంకో వైపు సీక్వెల్ తీస్తున్నారు.
తాజాగా 7/G బృందావన కాలనీ 2 చిత్రంలో కీలక అప్ డేట్ వచ్చింది. ఇందులో ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురు ఆదితి శంకర్ తో పాటు ఇంకో నటి నటిస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మలయాళ నటి అనస్వర రాజన్ కూడా ఓకే అయ్యిందని టాక్. రాబోయే ఈ సీక్వెల్ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అలనాటి మూవీలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ కీ రోల్స్ పోషించారు. ఈ చిత్రానికి సెల్వ రాఘవాన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయినట్లు వినికిడి.
