హైదరాబాద్ – తెలంగాణలో సంచలనం సృష్టించిన టీ న్యూస్ ఛానల్ స్పెషల్ కరెస్పాండెంట్ స్వేచ్ఛ ఓట్కర్ కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. సోమవారం తన భార్య స్వప్న తెరపైకి వచ్చింది. తను మీడియాతో మాట్లాడింది. మృతిచెందిన స్వేచ్ఛపై అభాండాలు మోపింది. తన భర్త అమాయకుడని, స్వేచ్ఛనే తనను బ్లాక్ మెయిల్ చేసిందని ఆరోపించింది. తనను కూడా వేధించిందని వాపోయింది. అసలు బాధితురాలు తనేనంటూ పేర్కొంది. మరో వైపు స్వేచ్ఛ పేరెంట్స్ మాత్రం పూర్ణచందర్ కు మహిళల పిచ్చి ఉందని ఆరోపించారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు.
వివరాల్లోకి వెళితే, స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న పూర్ణచందర్‌ను వెనకేసుకొచ్చింది.
తన భర్త ద్వారానే స్వేచ్ఛ తనకు పరిచయమైందని, అయితే వారిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి తనకు మొదట తెలియదని చెప్పింది. వారి వ్యవహారం తెలిసిన తర్వాత తాను పూర్ణచందర్‌ను వదిలేశానని స్పష్టం చేశారు.
అంతేకాకుండా, స్వేచ్ఛ తనను మానసికంగా తీవ్రంగా వేధించిందని స్వప్న ఆరోపించారు. పూర్ణచందర్‌ను స్వేచ్ఛ బ్లాక్‌మెయిల్ చేసిందని, తన పిల్లలను కూడా “అమ్మా” అని పిలవాలంటూ భయపెట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛ కూతురు అరణ్య తన భర్తపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని స్వప్న కొట్టిపారేశారు. పూర్ణచందర్.. అరణ్యను సొంత కూతురిలాగే చూసుకున్నాడని తెలిపింది.
