ఇటీవల టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో విడుదలై సూపర్ సక్సెస్ అయిన సినిమాలు తిరిగి రిలీజ్ అవుతున్నాయి. ఆశించిన దానికంటే ఎక్కువగా కలెక్షన్స్ వస్తుండడంతో నిర్మాతలు వీటిని ప్రేక్షకుల ముందుకు తిరిగి తీసుకు వచ్చేందుకు దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా అందాల రాక్షసి చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఎవరూ ఊహించని విధంగా ముందస్తు బుకింగ్స్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి.
ఇటీవల ప్రిన్స్ మహేష్ బాబు నటించిన మూవీస్ కు మంచి ఆదరణ లభించింది. ఖలేజా బిగ్ సక్సెస్ అయ్యింది. గతంలో కంటే ఎక్కువగా రీ రిలీజ్ సందర్బంగా వచ్చాయి. ఆ మూవీ కోవలోకి వచ్చింది అందాల రాక్షసి చిత్రం. ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. ఇందులో నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు. ఈ హీరోయిన్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఇంటి కోడలుగా మారింది. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కు భార్యగా మారింది.
ఇక అందాల రాక్షసి చిత్రంలో వీరితో పాటు రాహుల్ రవీంద్రన్ నటించారు. అప్పట్లో రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. బుల్లితెరపై కూడా సందడి చేసింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించారు. ఈ సినిమాకు రథన్ సమకూర్చిన సంగీతం ప్లస్ పాయింట్ గా మారింది. అందాల రాక్షసి 2012లో విడుదలైంది. పాటలు బిగ్ హిట్ గా నిలిచాయి. హృదయాలను హత్తుకునేలా తీశాడు దర్శకుడు హను రాఘవపూడి.
