ఆంధ్రా కింగ్ తాలూకా గ్లింప్స్ అదుర్స్

రామ్ పోతినేని భాగ్య‌శ్రీ బోర్సే కీ రోల్స్

టాలీవుడ్ యంగ్ ఎన‌ర్జిట‌క్ హీరో రామ్ పోతినేని, బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ నుంచి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఈ మూవీకి సంబంధించి గ్లింప్స్ విడుద‌ల చేశారు మూవీ మేక‌ర్స్. యూత్ ను ఆక‌ట్టుకునేలా ఉంది. ఏ పాత్ర ఇచ్చినా దానికి మించి ప‌ర్ ఫార్మెన్స్ చేయ‌డంలో త‌న‌కు త‌నే సాటి.

పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించి ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క హిట్ ద‌క్క‌లేదు. ఆ మూవీకి సీక్వెల్ తీసినా వ‌ర్క‌వుట్ కాలేదు. ప్ర‌స్తుతం ట్రెండ్ మారుతోంది. ప్రేక్ష‌కుల అభిమానులు, ఆలోచ‌న‌లు మారుతున్నాయి. బాగున్న క‌థ‌కు ప్ర‌యారిటీ ఇస్తున్నారు. దీంతో స్టార్ హీరోలు సైతం త‌మ మ‌న‌సు మార్చుకుంటున్నారు. కామెడీ, స‌స్పెన్స్ , ఉత్కంఠ రేపే స‌న్నివేశాలు ఉండేలా క‌థ‌ను త‌యారు చేసుకుని రావాలంటూ ద‌ర్శ‌కుల‌ను కోరుతున్నారు.

ఇక మాస్ మ‌సాలా, రొమాన్స్ తో పాటు వివాదాస్ప‌దంగా ఉండేలా పాట‌ల‌ను కంపోజ్ చేస్తున్నారు సంగీత ద‌ర్శ‌కులు. ఇలాగే ఉండాల‌ని ప‌ట్టు ప‌డుతున్నారు ద‌ర్శ‌కుడు, నిర్మాత‌. తాజాగా బోర్సేతో క‌లిసి ప్రేమ‌క‌థ ఆధారంగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. అమ్మాయిల మ‌న‌సు దోచే పాత్ర‌ను పోషించాడు. తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మొత్తంగా ఈసారైన ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ ఏ మేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుంద‌నేది వేచి చూడాలి.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com